నాలుగు దశాబ్దాల ప్రజాసేవకు ప్రతీకగా తుమ్మల నాగేశ్వరరావు 

తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలిన లంక రాజు 

నాలుగు దశాబ్దాల ప్రజాసేవకు ప్రతీకగా తుమ్మల నాగేశ్వరరావు 

 

 

భద్రాచలం: లోకల్ గైడ్ : 
తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రాష్ట్ర మార్కెటింగ్ మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాసేవలో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భద్రాచలంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలిన లంక రాజు మాట్లాడుతూ, సాధారణ రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు తన క్రమశిక్షణ, పరిపాలనా దక్షత, ప్రజా సమస్యలపై అవగాహనతో రాష్ట్ర రాజకీయాల్లో విశిష్ట గుర్తింపు పొందారన్నారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజాసేవలో కొనసాగుతూ పలు కీలక పదవులు నిర్వహించిన ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తుమ్మల చేసిన సేవలు చిరస్మరణీయమని, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగ బలోపేతం, గ్రామీణ అభివృద్ధి వంటి అంశాల్లో తీసుకున్న నిర్ణయాలు వేలాది మంది రైతులకు, సాధారణ ప్రజలకు ఎంతో మేలు చేశాయని పేర్కొన్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయనను ప్రజలు అభివృద్ధి ప్రదాతగా అభివర్ణిస్తుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెల్లం వెంకట్రావుతో కలిసి కాంగ్రెస్ నాయకులు పోలిన లంక రాజు, సుందరి సురేష్, పోట్రూ బ్రహ్మానంద రెడ్డి తదితరులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సహకారమే తన రాజకీయ ప్రస్థానానికి బలమని పేర్కొన్నారు. ప్రజా సేవే తన జీవిత లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News