టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు

*-జర్నలిస్టుల సమస్యలపై పోరాటం కొనసాగుతుంది..మామిడి సోమయ్య

టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు

హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ మీడియా సంస్థకు అనుబంధం కాదని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య స్పష్టం చేశారు. సంఘంపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం హైదరాబాద్‌లో నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ గోలి విజయకుమార్‌తో పాటు పలువురు జర్నలిస్టులు టిడబ్ల్యూజేఎఫ్‌లో చేరగా, వారికి మామిడి సోమయ్య సభ్యత్వం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జర్నలిస్టులను అయోమయానికి గురి చేయడానికే కొందరు ఈ సంఘం తమదేనని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను జర్నలిస్టులు నమ్మవద్దని కోరారు. సంఘం వ్యవస్థాపక సభ్యులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటిస్తూ సంఘం బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలిపారు. అయితే కొందరు మాజీ నాయకులు సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అన్ని జిల్లాలలో మహాసభలను త్వరితగతిన పూర్తి చేసి, త్వరలో రాష్ట్ర మహాసభలను భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా జర్నలిస్టుల ప్రధాన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల ఉద్యమానికి టిడబ్ల్యూజేఎఫ్ సిద్ధమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కో-కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ రవికుమార్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు
హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ మీడియా సంస్థకు అనుబంధం కాదని ఆ...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
కాంగ్రెస్ పార్టీ లోకీ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో భారీ చేరికలు 
తెలంగాణ ఉద్యమంలో ‘దరువు’ పాత్ర అభినందనీయం
వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో.
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మండల సమితి సమావేశం.
మియాపూర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు