నల్లగొండ ఉమ్మడి జిల్లా .ఫిబ్రవరి 26. (లోకల్ గైడ్)
ఈనెల 28వ తేదీన వరంగల్ లో జరుగుతున్న ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికుల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండలోనీ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రాష్ట్ర మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులు పర్మినెంట్ కు నోచూకోలేదని నేటికీ శ్రమదోపిడికి గురవుతున్నారని కావున ఆసుపత్రి కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉద్యోగ భద్రత లేకున్నా అరకొర వేతనాలతో శ్రమ దోపిడీకి గురవుతున్న ప్రభుత్వ ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ కార్మికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు.. సమాన పనికి సమాన వేతనం అందించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి దశాబ్దాలు గడుస్తున్న కోర్టు తీర్పులను కూడ అమలు చేయకపోవడం ఎంతో బాధాకరమని అన్నారు.ప్రస్తుతం ప్రభుత్వ వైద్యరంగంలో ఏజెన్సీల విధానం ద్వారా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలు అందిస్తున్నారని దీనిద్వారా ఏజెన్సీల కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతున్నారే తప్ప ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు వారి సంక్షేమం ప్రభుత్వ ఖజానా గణాంకాల్లో లెక్కలు తప్ప క్షేత్రస్థాయిలో కాంట్రాక్టు కార్మికుల బతుకులు ఆగం అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏజెన్సీల విధానం రద్దుచేసి తక్షణమే కార్పొరేషన్ ద్వారా నేరుగా కార్మికులకు జీతభత్యాల అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే హాస్పిటల్ కార్మికులకు వచ్చే వేతనాలు ఏమాత్రం సరిపోవటం లేదని టెండర్ల కాలపరిమితి ముగిసిన నేటికీ పాత టెండర్లను కొనసాగిస్తూ తక్కువ వేతనాలతో పని చేయిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే కొత్త టెండర్లు పిలిచి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల సాధనకై ఈ నెల 28న వరంగల్ జిల్లా కేంద్రంలో వేలాదిమందితో భారీ ప్రదర్శన కార్మిక సభను ఏర్పాటు చేస్తున్నామని కనుక వరంగల్ సభకు మెడికల్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సిబ్బంది పెద్ద ఎత్తున తరలి రావాలని దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు ఏం యాదగిరి పి ఎల్లమ్మ పద్మ అన్నపు లింగస్వామి, మధు. లక్ష్మణ్ ,భాగ్యమ్మ , అనూష, లక్ష్మీ,సబిత అలివేలు సంపూర్ణ కవిత కల్పన యాదమ్మ, ఏ శ్రీదేవి మమత, నవీన్, ప్రసాద్ మహేష్ మంజుల సైదమ్మ శివ , విజయ్, టి పద్మ ,అండాలు సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.