భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మండల సమితి సమావేశం.
సమస్యల పట్ల అనునిత్యం ప్రజా పోరాటాలు నిర్వహిస్తుందని వారన్నారు.
(లోకల్ గైడ్ తెలంగాణ)
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి సమావేశం వై పద్మ అధ్యక్షతన జరిగింది . ఈ సమావేశానికి సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పేద ప్రజల పక్షాన ఉండి వారి సమస్యల పట్ల అనునిత్యం ప్రజా పోరాటాలు నిర్వహిస్తుందని వారన్నారు కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని సామాన్య మానవుడు ఏమి కొనేటట్టు లేదు ఏం తినేటట్లు లేదు అన్న చందంగా నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసినారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు అదుపు చేయకుండా రేట్లు పెంచడం ఎంతవరకు సమంజసం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మొదటి కేసులు కొంతమందికి ఇల్లు రావడం జరిగినది ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ఇండ్లు నిర్మాణం చేసుకొనుటకు చాలామంది ఎదురుచూస్తున్నారు వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన గ్రామీణ ప్రాంతాలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా చూడాలని వారన్నారు మన మిర్యాలగూడ ప్రాంతానికి ఆనుకొని ఉన్న పందిళ్ళపల్లి చెరువు ను మినీ ట్యాంక్ బండ్ చేస్తామని గత ప్రభుత్వం కొంత బడ్జెట్ శాంక్షన్ చేసింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన కానుంచి ఆ మినీ ట్యాంక్ బండి విషయంలో చొరవ తీసుకొని చెరువు చుట్టూ రోడ్డు నిర్మాణం చేయాలని వారన్నారు గతంలో చెరువు చుట్టూ హద్దురాలు బాధటం జరిగిందని ఆ హద్దురాలను చెరువు కానుకోనున్నటువంటి రైతులు పుక్కిళ్ల ద్వారా హద్దురాలను తొవ్వి చెరువు లోపటికి బాతినారని వారన్నారు వెంటనే మరల చెరువు చుట్టూ కొలతలు వేసి 40 సంవత్సరాల క్రితం చెరువు ఉన్నదో ఆ హద్దుల ద్వారా చెరువు చుట్టూ రింగ్ రోడ్డు వేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నదని వారన్నానేను.రు అవసరమనుకుంటే హైడ్రా ద్వారా చెరువును ట్రాన్సక్షన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆక్రమించుకున్నటువంటి చెరువును తొలగించాలని వారు అన్నారు యూరియాను ఆన్లైన్ ద్వారా బుకింగ్ యాప్ ను రద్దు చేయాలని నేరుగా అధికారుల ద్వారా రైతులకు యూరియా అందించాలని వారు అన్నారు ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బిల్లా కనకయ్య సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అంజనపల్లి రామలింగం మహిళా సమైక్య నాయకురాలు ఎర్రబోతు పద్మ, ఎస్కే షమీం,బంటు రాజేశ్వరి,గోగుల యాదగిరి, గువ్వల మట్టయ్య, సాలె జగన్, లక్ష్మమ్మ,సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.
