వల్లభ్‌రావుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం.

లబ్ధిదారులకు గృహాలు అందజేసిన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

వల్లభ్‌రావుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం.

IMG-20260223-WA0382మిడ్జిల్ పిబ్రవరి 23(లోకల్ గైడ్):
 
మిడ్జిల్ మండలంలోని వల్లభ్‌రావుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.లబ్ధిదారులకు ఇళ్లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల గృహ కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి నివాస సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.వల్లభ్‌రావుపల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లతో పలు కుటుంబాలు సురక్షిత గృహాలలో నివసించే అవకాశం లభించిందని చెప్పారు. నియోజకవర్గంలోని ఇతర గ్రామాల్లో కూడా అర్హులైన వారికి దశలవారీగా గృహాలను మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత. అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.
లోకల్ గైడ్/తాండూర్:ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దెముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండల పరిధిలోని...
సమాజ అభివృద్ధికి మహిళలు ఆదర్శంగా నిలవాలి 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. 
స్వంత ఇల్లు కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 
పోస్టర్ తయారీపై విద్యార్థికి ప్రథమ బహుమతి 
ఈనెల 9న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి. 
సామాజిక లైంగిక దోపిడికి గురౌతున్న మహిళల