తెలంగాణ ఉద్యమంలో ‘దరువు’ పాత్ర అభినందనీయం

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ

తెలంగాణ ఉద్యమంలో ‘దరువు’ పాత్ర అభినందనీయం

హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మబలిదానాలు చేసిన విద్యార్థుల త్యాగాలను ప్రపంచానికి తెలియజేయడం లో, పాలకుల కళ్లు తెరిపించ డంలో దరువు సాంస్కృతిక వేదిక చేసిన కృషి అభినంద నీయమని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ అన్నారు. ఉత్తమ సాహిత్యం, ఆలోచింపజేసే పాటల ద్వారా తెలంగాణ సమాజంలో ఉద్యమ చైతన్యం కలిగించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని ఆయన కొనియాడారు. దరువు సాంస్కృతిక సంస్థ 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏప్రిల్‌లో నిర్వహించనున్న దరువు జాతర కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విరాహత్ అలీ మాట్లాడుతూ..ఇరవై ఐదేళ్ల క్రితం పోరాటాల గడ్డ అయిన సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆవిర్భవించిన దరువు సంస్థ, ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణలోని అనేక విశ్వవిద్యాలయాలలో వేలాది మంది విద్యార్థులలో ఉద్యమ చైతన్యం నింపి, లక్షలాది మంది ప్రజల ఆదరణ పొందిందని తెలిపారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దరువు ఎల్లన్న మాట్లాడుతూ..దరువు సాంస్కృతిక వేదికకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా “దరువు జాతర” పేరిట ఏప్రిల్ 20న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో భారీ సాంస్కృతిక సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సంస్థ అధ్యక్షుడు దరువు అంజన్న మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి పలువురు కళాకారులు, ఉద్యమకారులు, ప్రముఖులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దరువు సంస్థ ప్రతినిధులు దుర్గం భాస్కర్, వరంగల్ రవి, దరువు రమేష్, తిరుమల, అందె కృష్ణ, కిందిపాక యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు
హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ మీడియా సంస్థకు అనుబంధం కాదని ఆ...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
కాంగ్రెస్ పార్టీ లోకీ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో భారీ చేరికలు 
తెలంగాణ ఉద్యమంలో ‘దరువు’ పాత్ర అభినందనీయం
వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో.
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మండల సమితి సమావేశం.
మియాపూర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు