శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
మియాపూర్ డివిజన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు కాలనీలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగీతం, సామాజిక సేవ, ఐటీ, న్యాయ వృత్తి తదితర రంగాలలో ప్రతిభ కనబరిచిన సుమారు 60 మంది మహిళలను శాలువాలతో సత్కరించి “మహిళా ప్రతిభా పురస్కారాలు” అందజేశారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, మహిళల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, మహిళలు, ట్రస్ట్ సభ్యులు కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఎండి షా, భాస్కర్ రెడ్డి, లోకేష్, కేశవ్, ప్రసాద్, రమేష్, శంకర్, రాణి, కవిత, శశి. యలమంచి నవ్యశ్రీ తో పాటు టీమ్ సభ్యులు శరత్, రాధాకృష్ణ, రమేష్, వంశీ, ప్రవీణ్, రాజేష్ చౌదరి, నాగసాయి, సాయి నిఖిల్, రాజేష్, సతీష్, వినోద్, నాని, వినయ్, శివ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం మహిళా సాధికారత, ఐక్యతను పెంపొందించే దిశగా విజయవంతంగా నిర్వహించారు.