గజ్జి మధుసూదన్ ఆధ్వర్యంలో.
చిరుమర్తి స్కూల్లో రూ 20 వేలతో ప్రతిభ నగదు పురస్కారాలు
By Ram Reddy
On
దివ్యాంగురాలైన ఆశ్ర వైద్య ఖర్చులకు రూ 10 వేలు. మరొకరికి ట్రై సైకిల్
మిర్యాలగూడ ఫిబ్రవరి 19
(లోకల్ గైడ్, తెలంగాణ)
యుపిఎస్ చిరుమర్తి స్కూల్లో గజ్జి నాగభూషణం జ్ఞాపకార్థం గజ్జి నాగభూషణం ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. 2024- 25 ఈ సంవత్సరం 2025 -26 సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన
విద్యార్థులకు,
అదేవిధంగా 4వ తరగతి, 5వ తరగతి,6వ తరగతి విద్యార్థులకు సైతం మొదటి ప్రతిభా పురస్కారంగా 1,400 రూపాయలు, ద్వితీయ ప్రతిభా పురస్కారంగా 1,200 రూపాయల చొప్పున మొత్తం 15 వేల 600 వందల రూపాయలు అందజేశారు. ఇద్దరు దివ్యాంగుల విద్యార్థులకు 1000 చొప్పున 2000 రూపాయలు అందించారు.అదేవిధంగా దివ్యాంగురాలైన ఆశ్ర వైద్య ఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయలు, మరో దివ్యాంగుడైన సంపత్ కు ట్రై సైకిల్ ఇవ్వనున్నట్లు శివాలయ ఆలయ కమిటీ అధ్యక్షుడు సోమేశ్వర ధార్మిక పరిషత్ అధ్యక్షులు గజ్జి మధుసూదన్,అమృతవల్లి దంపతులు ముందుకు వచ్చారు. గజ్జి నాగభూషణం కూతురైన కామిశెట్టి సరళ విద్యార్థులకు యోగా చేయడానికి కావలసిన మ్యాట్లు అందజేస్తానని ముందుకు వచ్చారు.
ఈ కార్యక్రమంలో గజ్జి నాగభూషణం సతీమణి గజ్జి అనసూయ, కామిశెట్టి సరళ సర్పంచ్ కూరెల్లనాగమణి వెంకటాచారి, ప్రధానోపాధ్యాయులు మారోజు విజయ, ఉపాధ్యాయులు అచ్చమ్మ, ప్రభాకర్,సతీష్,జానీ బేగం, సైదులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
04 Mar 2026 20:53:55
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
