ప్రధాని, రాష్ట్రపతి నుంచి ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

రామసహాయంకు అత్యున్నత స్థాయి గౌరవం

ప్రధాని, రాష్ట్రపతి నుంచి ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

ఖమ్మం :లోకల్ గైడ్ :
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫిబ్రవరి 19న ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగానే ప్రత్యేకంగా లేఖలు పంపి అభినందనలు తెలియజేశారు.

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన సందేశంలో దేశ అభివృద్ధి, సమగ్ర పురోగతికి రఘురాం రెడ్డి సేవలు కీలకమని పేర్కొన్నారు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము  కూడా తన సందేశంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశానికి అంకితభావంతో కొనసాగుతున్న సేవలు అభినందనీయమని అన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ప్రధాని, రాష్ట్రపతిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశ అత్యున్నత నాయకుల ఆశీర్వాదాలు తనపై ఇంకా బాధ్యతను పెంచాయని, ప్రజాసేవలో మరింత అంకితభావంతో ముందుకు సాగుతానని అన్నారు.

Tags:

About The Author

Latest News

మంత్రి వాహనంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు  మంత్రి వాహనంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు 
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక...
కార్మికుల హక్కులను కాలరాసేందుకే కేంద్ర సర్కార్ లేబర్ కోడ్ తెచ్చారు.                                                                    
గుండ్లగడ్డ  కిష్ట బావి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం
భూమి సారమే భవిష్యత్తు – సేంద్రియ మార్గంలో ముందుకు నాక్రో బయోటెక్
ధ్రువపత్రాలు అందుకున్న బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు 
పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం
ప్రధాని, రాష్ట్రపతి నుంచి ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు