ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే మూల ఆధారం. 

ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్.

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే మూల ఆధారం. 

నల్లగొండ  ప్రతినిధి .జనవరి 25 లోకల్ గైడ్ 
నాగార్జున కళాశాల (అటానమస్) ప్రాంగణంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం
యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ డా. బొజ్జ అనిల్ కుమార్  అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా డా. అనిల్ కుమార్ బొజ్జ  మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే మూలాధారమని తెలిపారు. ఓటును అమ్ముకోవద్దని, ఓటు చాలా విలువైనదని, ప్రతి ఒక్కరూ తన ఓటు హక్కును బాధ్యతాయుతంగా, సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల నిర్లక్ష్యం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడే ప్రమాదం ఉందని, అందుకే ప్రతి ఎన్నికలో పాల్గొనడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.
యువత ఓటు నమోదు ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు.స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలు జరగాలంటే ప్రతి ఓటు నిజాయితీగా పడాలని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు వేయడం ద్వారా మాత్రమే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్లు, విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ  చేయించారు. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కు వినియోగం ద్వారా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని  సూచించారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం యువతలో ప్రజాస్వామ్య చైతన్యం పెంపొందించేందుకు ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు జాజుల దినేష్, డా అంకుష్, లింగస్వామి, శంకర్, జగదీశ్వర్, శ్రీకాంత్, మహేష్, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.

Tags:

About The Author

Latest News

తమ్ముడు అంటే ఇలా ఉండాలి. తమ్ముడు అంటే ఇలా ఉండాలి.
లోకల్ గైడ్ : షాద్‌నగర్ అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
టీజేఎంయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎండీ ఫస్సిద్దిన్ ఏకగ్రీవ ఎంపిక 
షాద్ నగర్ పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ కు ఓటు వేయండి.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధిని అందించగలదు.
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 
మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య