అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటాం....
మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి.
బెల్లంపల్లి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 23వ వార్డులో జరిగిన అగ్ని ప్రమాదం బాధితులను ఆదుకుంటామని బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదానికి గురైన గొడుగుల విజయలక్ష్మి అనే మహిళకు చెందిన ఇంటిని మున్సిపల్ కమిషనర్ రెడ్డితో కలిసి చైర్ పర్సన్ మంగళవారం పరిశీలించారు.అనంతరం ఆమె ఎమ్మెల్యేతో ఫోన్ లో మాట్లాడి స్థానికంగా నెలకొన్న పరిస్థితిని వివరించారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి త్వరితగతిన పంచనామా పూర్తి చేసి ప్రభుత్వం నుండి అందే నష్టపరిహారం బాధిత కుటుంబానికి త్వరగా అందేలా చూడాలని ఆదేశించారు.బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన తెలిపారు.చైర్ పర్సన్ వెంట కౌన్సిలర్ లు జంగం కల్పన,శ్రావణ్,కాంగ్రెస్ నాయకులు కంకటి శ్రీనివాస్,మున్సిపల్,రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
