వేసవి సెలవులు వచ్చేసాయి తల్లిదండ్రులారా మీ పిల్లల గురించి జాగ్రత.
మీ పిల్లలు ఈతకు వెళితే వారితో పాటు మీరు వెళ్ళండి ఓ తల్లిదండ్రులారా
లేనిచో తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతుంది
మీ పిల్లలకు మోటర్ బైక్లు అసలు ఇవ్వకండి
స్నేహితులతో దూర ప్రాంతాలకు వెళ్ళనివ్వకండి వేరే వారిని విహారయాత్రలకు తీసుకెళ్లండి
తల్లిదండ్రుల జాగ్రత్త వేసవి సెలవు చేశాయి మీ పిల్లలు కంటికి రెప్పలా కాపాడుకోండి. మీ పిల్లలు చేసే సరదా పనులే ప్రాణం మీదికి తెస్తున్నాయి. ఎవరికి కడుపు కోతే మిగులుతుంది. కనుక దయచేసి
ఈతకు వెళ్లేవారిని కనిపెడుతూ ఉండాలి ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో చెరువులు, కుంటలు, వాగులు, బావుల్లో
స్నా నాలు చేయడానికి పిల్లలు, యువకులు ఎక్కువశాతం శ్రద్ధచూపుతుంటారు. వచ్చిరాని ఈతతో ఎందరో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు కోకొల్లలు. ఈత సరదా కోసం వెళ్లి, చెరు వుల్లో విగత జీవులుగా తేలియాడితే కన్నవారి కడుపు కోత వర్ణాతీతం. సరదా కోసం,ఈత రాకున్నా నీళ్లలో దూకి ప్రాణాలను కోల్పోతున్నవారిని చూస్తే కన్నీళ్లు లేదు.వేసవి సెలవులు వచ్చేసాయి చిన్నారులను కంటికి రెప్ప లా కాపోడుకోవాల్సిన సమయం వచ్చింది కనుక బాధ్యతగా మీరు ఉండాలి. సెలవులు వస్తే పిల్లల సంతోషానికి హద్దులే ఉండవు.ఇంట్లో ఒక్క నిమిషం ఉండరు.స్నేహితులతో సరదాగా గడపడానికి గడపదాటుతారు. పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారో? చెరువులోకి ఈతకు వెళ్తున్నా రో? తెలియదు. కొందరు స్నేహితులతో కలిసి ఆటలు ఆడితే.. మరికొంతమంది ఈత నేర్చుకోవడానికి చెరువులు, కుంటలలోకి వెళ్తుంటారు.కానీ, స్థానిక చెరువులు,కుంటల స్థితిగతులు తెలుసుకోకుండా అందులోకి దిగి మృతి చెందిన సంఘటనలు కోకొల్లలు. తెలిసీతెలియని వయస్సులో ఈతకు వెళ్లి నీట మునిగి చనిపోతున్నారు.నీటి ప్రమాదాల్లో తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. పిల్లలు ఆహ్లాదం కోసం నీటిలో దిగడానికి ఉత్సాహం చూపుతారు. పిల్లలు ఈత కోసం వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు సూచించడమే కాకుండా, నీటి నుంచి కాపాడే లైఫ్‌జాకెట్లు, రబ్బర్ ట్యూబ్, మొదలగు రక్షక అవసరాలను తీసుకెళ్లి వారికి దగ్గరుండి స్వయంగా ఈత నేర్పించండి. ఇలా మీ పిల్లల ఆనందాన్ని మీ కళ్ళముందే మీరు చూస్తూ సంతోషపడండి కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లను ఒంటరిగా పంపవద్దు. ఇంకొందరు పిల్లలు ఎండాకాలంలో తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి బైకులను తీసుకొని వెళ్లి వాహనాలు నడపడం సరిగా తెలియక ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు ఇలా ఎందరో మంది విద్యార్థులు సెలవుల్లో ఎంజాయ్ గా గడపాలని అత్యుత్సవంతో వెహికిల్స్ ను వేగంగా నడిపే ప్రమాదాలకు లోన్ అవుతున్నారు. ఈ ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలిస్తున్నారు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు తమ బిడ్డలు అర్థాంతరంగా ప్రమాదాల బాధ పడి చనిపోవడం ఎంతో బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జాగ్రత్త మీ పిల్లలు సెలవుల్లో ఎక్కడికి వెళ్ళినా వారికి తోడుగా మీరు వెళ్ళండి వారి సంతోషంలో మీరు బాగా నవ్వండి వారికి మంచి జడలు చెప్పండి వారికి మీరు దగ్గరుండి క్రమశిక్షణ నేర్పించాలి ప్రేమగా ఆప్యాయతగా మంచి నేర్పండి వారికి వినోదాన్ని సంతోషాన్ని అందించండి. భావి భారత పౌరులుగా తయారు చేయండి. వారికి ఆదర్శంగా ఉండండి ఆత్మీయతతో ప్రేమను అందివ్వండి. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడిపే విధంగా చూసుకోండి మీరు ఆనందంగా ఉండండి మీ పిల్లల భవిష్యత్తుకు ఆనందాన్ని కలిగించండి అంతే తప్ప అనవసరంగా వారిని వదిలిపెట్టకండి వదిలిపెట్టి మీరు బాధపడకండి. తల్లిదండ్రులారా మీ పిల్లల భవిష్యత్తును గుర్తించి వారికి చక్కని సందేశాత్మకమైనటువంటి కథలను చెప్పండి ఉపాధ్యాయుల పట్ల దేశం పట్ల పెద్దలపట్ల గౌరవ మర్యాదలతో మెలిగే విధంగా వారిని తీర్చిదిద్దండి అప్పుడే మీ జన్మకు సార్ధకత కలుగుతుంది మీ పిల్లల భవిష్యత్తుకు మేలు కలుగుతుంది. అనే విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు