ఇవాల్టి బంగారం ధరలు!... ఏంటి ఈ మార్పులు?

ఇవాల్టి బంగారం ధరలు!... ఏంటి ఈ మార్పులు?

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ తారుమారు అవుతూనే ఉన్నాయి. ఒకరోజు బంగారం ధరలు తగ్గితే, మరో రోజు బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో బంగారం కొనాలి అంటేనే సామాన్య ప్రజలు భయంతో వణికి పోతున్నారు. తాజాగా దేశీయ బులిటెన్ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారంతో పోలిస్తే... నేడు మళ్లీ  విపరీతంగా పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం అలాగే విజయవాడ వంటి నగరాలలో 22 క్యారెట్ల ( 10 గ్రాములు ) బంగారం ధర 650 రూపాయలు పెరిగి... ఏకంగా 82,900 రూపాయలకు చేరింది. అలాగే మరోవైపు 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర 710 రూపాయలు పెరగడంతో... 90,440 రూపాయలకు చేరుకుంది. అయితే మరోవైపు వెండి ధర వెయ్యి రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 1,02,000 రూపాయల  వద్ద కొనసాగుతోంది. అసలే ఎండాకాలం కావడంతో పెళ్లిళ్లు లేదా ఫంక్షన్లు జరుపుకునే సామాన్య ప్రజలు బంగారం ధరలను చూసి షాక్ అవుతున్నారు. download (4)

Tags:

About The Author

Related Posts

Latest News