కొయ్యడ మల్లేష్ కు ముచర్ల సత్తన్న పురస్కారం..
అందజేసిన హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి సీతక్క
రఘునాథపల్లి:జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం లోని వెల్డి గ్రామ మాజీ సర్పంచ్ కొయ్యడ మల్లేష్ కు ముచర్ల సత్తన్న పురస్కరాన్ని సోమవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కల చేతుల మీదుగా ముచ్చర్ల సత్తన్నఅవార్డు ను అందించారు. ముచర్ల సత్తన్న పంచాయతీ పాట ఆవిష్కరణతోపాటు రాష్ట్రంలో 6గ్రామాల పంచాయతీ సర్పంచ్ లకు పురస్కరాలు అందించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆర్ధికంగా నష్టపోకుండా.. నిస్వార్ధంగా పోటీ చేసి గెలవాలని వక్తలు తెలిపారు. ఈసందర్భంగా కొయ్యడ మల్లేష్ మాట్లాడుతూ స్వచ్చందంగా ఊరికి ప్రజా సేవ చేయడానికి సహకరించిన గ్రామస్తులకు, యువకులకు, అలాగే 5సంవత్సరాలు సర్పంచ్ గా తన బాధ్యతలు విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన జిల్లా, మండల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు తన సేవలను గుర్తించి మాజీ మంత్రి ముచ్చర్ల సత్తన్న పురస్కారం అందించిన
పృద్వి రాజ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిబద్ధతతో, ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజాసేవ లక్ష్యంగా తనదైన శైలిలో సామాజిక సేవ చేసినందుకు గ్రామ పేరును రాష్ట్ర స్థాయికి తీసుకు వెళ్లిన కొయ్యడ మల్లేష్ ని గ్రామస్థులు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు.
About The Author
Related Posts
