ఎమ్మెల్యే నాగరాజును విమర్శించడం హేయమైన చర్య 

ఎమ్మెల్యే నాగరాజును విమర్శించడం హేయమైన చర్య 

- గత 10 సంవత్సరాలలో నియోజకవర్గంలో ఒక రేషన్ కార్డు కూడా మంజూరు చేయాలని బిఆర్ఎస్ అసమర్ధ పాలన
- ఎస్సీ నియోజకవర్గం లో దొర పెత్తనం ఏంటి?
- అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్య ఆరోపణలు
- వర్ధన్నపేట మార్కెట్ చైర్మన్ నరుకుడు  వెంకటయ్య 

వరంగల్ (లోకల్ గైడ్) :  వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం రోజున కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు సత్యనారాయణ లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలోనే వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బిఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో వర్ధన్నపేట నియోజకవర్గం లో ఒక రేషన్ కార్డు కానీ ఒక ఇందిరమ్మ ఇల్లు గాని  ఎందుకు మంజూరు చేయించలేదని నిలదీశారు. దళిత నియోజకవర్గం లో దొర అయిన దయాకర్ రావు పెత్తనం చేయడం,దళిత ఎమ్మెల్యేను విమర్శించడం తగదని అన్నారు. విద్యావంతుడు, 30 సంవత్సరాలు ఉన్నత ఉద్యోగం చేసి పదవి విరమణ పొంది, ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఎమ్మెల్యేగా గెలిచి నిత్యం ప్రజలలో ఉంటు ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దళితుడు అయిన మా ఎమ్మెల్యే నాగరాజును మరోసారి విమర్శిస్తే దయాకర్ రావు ను మా దళితులు నియోజకవర్గంలో  తిరుగనివ్వరని,అడుగడుగున అడ్డుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు  మైసా సురేష్,వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు  తుళ్ళ రవి మాజీ జెడ్పిటిసి కమ్మగోని ప్రభాకర్ గౌడ్,  జిల్లా నాయకులు గోశాల వెంకన్న గౌడ్, శ్రీపాది సతీష్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి యాదగిరి, యూత్ మండల ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు మహమ్మద్ అక్బర్, నాయకులు గుజ్జా రవీందర్ రెడ్డి,నునావత్ బీమా నాయక్, కొండేటి బాలకృష్ణ, కొండేటి మధుకర్, తాళ్ల పెళ్లి యాదగిరి గౌడ్, నల్ల తీగల రవి, చీటూరి రాజు, మరు పట్ల సాయికుమార్, ఐత సుధాకర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News