వ్యవసాయ రంగానికి ఇందూర్ కేంద్రబిందువు కాబోతుంది - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్... 

వ్యవసాయ రంగానికి ఇందూర్ కేంద్రబిందువు కాబోతుంది - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్... 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్బంగా బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఇందూర్ పసుపు రైతుల దశబ్దల చిరకాల కోరిక  పసుపుబోర్డును పట్టువదలని విక్రమార్కుడిల ఎంపీ ధర్మపురి అరవింద్ సాధించడం జరిగిందన్నారు.ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తా అని బాండ్ రాసిస్తే ప్రతిపక్షాలు అవహేళన చేసాయని కానీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు సాధించడమే కాకుండా ఈ జిల్లా రైతు బిడ్డను చైర్మన్ చేసిన ఘనత మన ఎంపీకి దక్కుతుందన్నారు.పసుపు బోర్డు కేంద్రం ప్రకటించడం ఈ జిల్లా రైతు బిడ్డను చైర్మన్ చేయడం ఓర్వలేని ప్రతిపక్షాలు విషం చీమ్ముతూనే ఉన్నాయని అన్నారు. ఇందూర్ కేంద్రంగా ఏర్పాటు చేసే పసుపు బోర్డు కార్యాలయం కారణంగా ఇందూర్ వ్యవసాయ రంగానికి కేంద్ర బిందువుగా మారుతుందని అన్నారు.పసుపు బోర్డు ప్రకటించక  కార్యాలయం లేదని ప్రతిపక్షాలు అవహేళన చేసాయని ప్రతిపక్షాల కళ్ళు చేదిరిపోయేల  కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు,  రాజకీయ చాణిక్యులు పసుపుబోర్డ్ ఇందూర్ కి రావడంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షా చేతుల మీదుగా ఈ నెల 29 ఆదివారం రోజు మన ఇందూర్ జిల్లా కేంద్రంలో  పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం చేయటం జరుగుతుందన్నారు.అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు మహా సమ్మేళన కార్యక్రమం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.. కాబట్టి  ఇందూర్ జిల్లా ప్రజలందరు ముఖ్యంగా రైతు సంక్షేమన్ని కోరుకునే ప్రతి ఒక్కరు సభలో పెద్దఎత్తున పాల్గొన్ని  విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Latest News

సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దొంతి రవిశంకర్ ముదిరాజ్.             సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దొంతి రవిశంకర్ ముదిరాజ్.            
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు శాఖీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి డి. అనసూయ సీతక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు దొంతి...
రీయింబర్స్మెంట్ ఫీజులను విడుదల చేయాలి
విద్యార్థులకు తాగునీటికి ఇబ్బంది కలగకుండా తక్షణమే వాటర్ ట్యాంక్ కలెక్షన్ ఇప్పించాలి.
_నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు..._
తెలుగులోనూ రాణించాలన్నదే
హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం.
పోస్ట్ మ్యాన్ లపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దు