బిజెపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ బూర నర్సయ్య గౌడ్
By Ram Reddy
On
కార్యాలయ ప్రారంభం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డా. బూర నర్సయ్య గౌడ్ గారు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యలు, రోడ్ల దుస్థితి, సాగు నీటి కొరత, యువతకు ఉద్యోగ అవకాశాల లోపం – ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే. ప్రజలు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం అడ్డు తగులుతోంది” అని అన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శిస్త
మంత్రి పదవి, మంత్రి పదవి అని అడుక్కుంటూ నల్గొండ జిల్లా పరువు తీస్తున్నారు నల్గొండ ప్రజల కోసం జిల్లా అభివృద్ధి గురించి అడగకుండా మంత్రి పదవి అడుక్కోవడం ఏంటి
ఆయన తీరు చూస్తుంటే నల్గొండ వాసులుగా మాకే సిగ్గనిపిస్తుంది రాజగోపాల్ రెడ్డికి అంత సత్తా ఉంటే పదవికి రాజీనామా చేసి సొంతగా నిలబడాలి
అంత గౌరవం లేని చోట ఉండటం ఎందుకు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కూడా ఆయన ఘాటుగా స్పందిస్తూ
“ఓటు చోరీ… ఓటు చోరీ అంటూ ఆధారాలు లేకుండా మాట్లాడటం మతిస్థిమితం లేనట్టే. కాంగ్రెస్ నాయకులు నిజాయితీగా ఉంటే ముందుగా తమ పదవులకు రాజీనామాలు చేసి తర్వాతే నైతికత గురించి మాట్లాడాలి” అని డిమాండ్ చేశారు.
బీజేపీ లక్ష్యాలపై మాట్లాడుతూ –“ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోంది. అభివృద్ధి, పారదర్శకత, దేశ భద్రత బీజేపీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయాలు. కాంగ్రెస్ మాత్రం అబద్ధాల ప్రచారంలోనే మునిగిపోయింది. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ వేగంగా బలపడుతోంది. కొత్త కార్యాలయం పార్టీకి మరింత బలాన్ని, ప్రజలకు నమ్మకాన్ని ఇస్తుంది” అని నమ్మకం వ్యక్తం చేశారు.
Tags:
About The Author
Related Posts
Latest News
16 Nov 2025 23:44:24
కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ :
కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
