రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటడం ఖాయం 

స్థానిక సంస్థల్లో సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నాయి  - తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది  - మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటడం ఖాయం 


వరంగల్ ( లోకల్ గైడ్ ) : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఎంపీటీసీ 1 & 2 పరిధిలోగల కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు తుల కుమారస్వామి ఆధ్వర్యంలో ఆదివారం రోజున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ చేతిలో ప్రభుత్వం నడవడం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు. పార్టీ కష్టకాలంలో మన వెంబడి ఉన్నవారే మన కార్యకర్తలని, ఈ సమయంలో అధికార పార్టీ నుండి మన పార్టీలో చేరుతున్నారు అంటేనే ఈ ప్రభుత్వం పనితీరును మనం అర్థం చేసుకోవాలని తెలిపారు. గతంలో నేను ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశాను అది మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో యూరియా కొరత వచ్చింది అంటే ఈ అసమర్ధ ప్రభుత్వ పాలన మనకు అర్థమవుతుంది. కెసిఆర్ ప్రభుత్వంలో రాజుగా బ్రతికిన రైతులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో  పస్తులు  ఉండవలసిన  పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని ప్రతి కార్యకర్తను కలుపుకొని పనిచేయాలని, పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్ట పడవలసిన  అవసరం ఉందని సూచించారు. గ్రామాలలో గడపగడపకు మన కార్యకర్తలు తిరిగి ఈ బోగస్ ప్రభుత్వం చేసిన బోగస్ హామీలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం చేయవలసిన అవసరం ఉందని అన్నారు.కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని, తొందరలోనే కమిటీలు వేసి ప్రతి కార్యకర్తకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నాయని, పార్టీ క్యాడర్,యూత్, సోషల్ మీడియా నాయకులు ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మన సత్తా చాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అన్నంనేని అప్పారావు, మాజీ జెడ్పిటిసి మార్గం బిక్షపతి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూత్, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News