శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు.

శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మిడ్జిల్ జనవరి 14(లోకల్ గైడ్):

మిడ్జిల్ మండల పరిధిలోని కొత్తూరు గ్రామం లో తెలంగాణ రాష్ట్రంలో శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగలో భాగంగా భోగి రోజున కల్వకుర్తి డైరీ బీఎంసీ పరిధిలోని మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు పతంగుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలు, చిన్నారులకు శ్రీజ డైరీ తరఫున బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీజ సంస్థ సీఈఓ వీడియో కాల్ ద్వారా మహిళా రైతులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఒక్క బిల్లులో లక్ష రూపాయలు ఆదాయం పొందే స్థాయికి ఎదగాలని సూచించారు. మహిళా రైతులు మరింత ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాములుశ్రీజ డైరీ తెలంగాణ రాష్ట్ర ఏసీఓ యుగంధర్ రెడ్డి, పీఐబీ ఎగ్జిక్యూటివ్ మహేష్, కొత్తూరు పాలమిత్ర గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి