హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు

భోగి మంటను ఆయన స్వయంగా వెలిగించి వేడుకలను ప్రారంభించారు.

 

 మిర్యాలగూడ జనవరి 14
 (లోకల్ గైడ్,తెలంగాణ)

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు హౌసింగ్ బోర్డు విద్యానగర్ కాలనీలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజామునే కాలనీ వాసులందరూ ఏకమై భోగి మంటలు వేసి పండుగను ఘనంగా జరుపుకున్నారు.
ఈ వేడుకలకు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి  నాయకత్వం వహించారు. కాలనీ నడిబొడ్డున ఏర్పాటు చేసిన భోగి మంటను ఆయన స్వయంగా వెలిగించి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మన సాంప్రదాయాలను గౌరవిస్తూ, కాలనీ వాసులందరూ ఒకే కుటుంబంలా కలిసి మెలిసి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ భోగి మంటలు మన జీవితాల్లోని కష్టాలను తొలగించి, కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. కాలనీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి" అని పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి