మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
గత 16 ఏళ్లుగా బి ఎస్ యన్ ఎల్ టీమ్ ఆధ్వర్యంలో టోర్నమెంట్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):
మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 16 ఏళ్లుగా బి ఎస్ యన్ ఎల్ టీమ్ ఆధ్వర్యంలో టోర్నమెంట్‌ను నిరంతరంగా నిర్వహించడంఅభినందనీయమని పేర్కొన్నారు.గ్రామంలో క్రీడామైదానం అభివృద్ధి కోసం రెయిన్‌బో వెంచర్ నుంచి రావాల్సిన 4.20 గుంటల భూమికి గాను ఇప్పటికే ఒక ఎకరా భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, మిగిలిన స్థలం కూడా అందరూ కలిసి సమన్వయంతో తీసుకురావాలని కోరారు.అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కీ.శే. మన్యం వెంకట్ రెడ్డి స్మారకార్థం మొదటి బహుమతిగా రూ.15,000, కీ.శే. మన్యం యాదిరెడ్డి స్మారకార్థం రెండో బహుమతిగా రూ.10,000లను అందజేశారు.గ్రామ యువతకు క్రీడల్లో శిక్షణ అందించేందుకు అవసరమైన గ్రీన్ నెట్ నిర్మాణం కోసం తన వంతుగా రూ.1,00,000 విరాళంగా అందజేస్తానని మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
