స్నేహం ఐక్యతను పెంపొందించాలి

మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

స్నేహం ఐక్యతను పెంపొందించాలి

లోకల్ గైడ్   :     సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పి వై ఎల్ పి ఓ డబ్ల్యు పి డి ఎస్ యు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సింగరేణి మండలం టేకులగూడెం గ్రామంలో యువతీ యువకులను ఉత్సాహ పరిచేందుకు సంక్రాంతి సందర్భంగా మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామపంచాయతీ సర్పంచిగా గుమ్మడి సందీప్ ఉపసర్పంచిగా బిక్కసాని భాస్కరరావు, వార్డ్ మెంబర్లు  ఏకగ్రీవమైన సందర్భంగా విజయోత్సవ సభ  క్రికెట్ వాలీబాల్ టోర్నమెంట్, గ్రామీణ క్రీడలు ముగ్గులు, శంషా నిమ్మకాయ, కుండ కొట్టుడు పోటీలు నిర్వహించడం జరిగింది.
అనంతరం ప్రజాపంథా మండల కార్యదర్శి సర్పంచ్ గుమ్మడి సందీప్ అధ్యక్షతన జరిగిన సభలో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది.
 ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ  విజయోత్సవ సభ సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ వాలీబాల్ గ్రామీణ క్రీడలు ముగ్గుల పోటీలు,  నిమ్మకాయ శంషా ఆట  డాన్స్ పోటీలు నిర్వహించడం వలన యువతి యువకుల్లో ఐక్యత, స్నేహం,సుహృద్భావ  వాతావరణం, మానసిక ఉల్లాసం, ఆత్మీయత పెరుగుతాయని అన్నారు. నేడు సమాజంలో విష సంస్కృతి,అవిద్య, అజ్ఞానం, మూఢనమ్మకాలు, పేదరికం, మోసాలు,స్త్రీలపై అత్యాచారాలు,ప్రభుత్వాలు మద్యపాన వ్యాపారాలు చేయడం,త్రాగిన ప్రజలు  ప్రక్కదారులు పట్టడం వలన,శ్రమ సంస్కృతి మరుగున పడిపోతుందని, పెట్టుబడిదారీ వర్గాలు లాభ పడుతున్నాయని అన్నారు. ప్రజలను విభజించి పాలించే పరిస్థితులు నేడు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. సినిమాలు, టీవీ సీరియల్లో ప్రజలలో ఈర్ష ద్వేషాలు, పగ, కక్షలు, కార్పన్యాలు పెంచుతున్నయనీ అన్నారు. కుటుంబాలలో కలతలు, తగాదాలు సృష్టిస్తున్నాయని వారు విమర్శించారు. ప్రజా వ్యతిరేకమైన సాహిత్యాన్ని నిషేధించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాస్ లైన్ రాష్ట్ర నాయకులు చంద్ర అరుణ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ, రాఘబోయిన గూడెం సర్పంచ్ సురేష్ మాస్, లైన్ డివిజన్ కార్యదర్శి టి ఝాన్సీ పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు గోకినపల్లి లలిత పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వి రాకేష్  పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృద్వి మండల నాయకులు గుగులోత్ తేజ నాయక్ ధరావత్ సక్రు పులకాని సత్తిరెడ్డి వడ్డే వెంకటేశ్వర్లు వేములపల్లి వీరన్న  సూర్య పాక అనసూయ సరోజిని వార్డు మెంబర్లు మిరియా ముత్తి సుబ్బారావు గుమ్మడి నరసింహారావు దోమల సీత కొడెం రమణ గోగ్గిళ్ళ కృష్ణ మూడెం లక్ష్మి కనకరాజు గుమ్మడి చైతన్య పవిత్ర తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి