అశ్వారావుపేట లోకల్ గైడ్ :
మండల పరిధిలోని కావడిగుండ్ల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో వాలీబాల్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు, వాలీబాల్ ఆటను కావడిగుండ్ల గ్రామపంచాయతీ సర్పంచ్ బాడిశ లక్ష్మణరావు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకుడు కంగాల కల్లయ్య, డివిజన్ కార్యదర్శి గోకినెపల్లి ప్రభాకర్, ఉపసర్పంచ్ మండకం మంగరాజు రిబ్బన్ కట్ చేసి సంక్రాంతి సంబరాల సందడిని ప్రారంభించారు. వాలీబాల్ ఆటలో మొదటి బహుమతి 2000 రూపాయలు ప్రైజ్ మనీ ని కొత్తకావడిగుండ్ల జట్టు చేజిక్కించుకోగా, ద్వితీయ బహుమతి వెయ్యి రూపాయలను కావడి గుండ్ల గ్రామ జట్టు చేజిక్కించుకుంది. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి కంట్లం గ్రామం కు చెందిన మడివి సుధారాణి, రెండవ బహుమతి కావడిగుండ్ల గ్రామానికి చెందిన బాడిశ వెన్నెల, మూడో బహుమతి ఈదర లావణ్య కైవసం చేసుకున్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఈ ఆటల పోటీల్లో గ్రామస్తులంతా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ యంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు, పార్టీ మండల నాయకురాలు కంగాల భూలక్ష్మి, పార్టీ గ్రామ నాయకులు ఈధర మోహన్ రావు, మేణ్నీ పాండురాజు, ఆకుల బాబురావు, గ్రామ నాయకులు వార్డ్ మెంబర్ కంగాల వంశీ కుమార్, మడివి రవి కుమార్, కొమరం లక్ష్మణ్ రావు, సోడెం పౌల్ రాజు, పి ఓ డబ్ల్యు కబ్బడి కవిత, సోడెం రామమ్మ, ఎంపైర్ గా సన్యాసి సోమరాజు, కాకా రాజశేఖర్ లు వ్యవహరించగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.