తేజ సజ్జా కొత్త పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’ తాజా షెడ్యూల్ ప్రారంభం

తేజ సజ్జా కొత్త పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’ తాజా షెడ్యూల్ ప్రారంభం

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ తో ప్రేక్షకులను మెప్పించిన సూపర్ హీరో తేజ సజ్జా, తాజాగా మరో భారీ పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘మిరాయ్’ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తేజ సజ్జా ఈ సినిమాలో సూపర్ యోధుడిగా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. తేజ సజ్జాతో పాటు మరికొందరు కీలక పాత్రధారులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. చిత్రీకరణ పనులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని, ముందుగా ప్రకటించినట్లుగా ఈ సినిమా ఆగస్టులో విడుదల అయ్యేలా సిద్ధం చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.మిరాయ్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో, 2D మరియు 3D ఫార్మాట్లలో భారీగా విడుదల చేయనున్నారు. తేజ సజ్జా ఈ సినిమాలో సూపర్ యోధుడి పాత్ర కోసం పూర్తిగా కొత్త మేకోవర్‌ తో కనిపించబోతున్నారు.ఈ చిత్రంలో మనోజ్ మంచు విలన్‌గా, రీతికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తేజ సజ్జా, మనోజ్ మంచు లుక్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే బాధ్యతలు కూడా చేపట్టగా, మణిబాబు కరణం డైలాగ్స్ అందించారు. సంగీతం గౌరహరి అందించగా, ఆర్ట్ డైరెక్టర్‌గా నాగేంద్ర తంగల, కో-ప్రొడ్యూసర్‌గా వివేక్ కూచిభొట్ల, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కృతి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సుజిత్ కుమార్ కొల్లి వ్యవహరిస్తున్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

ఆవోపా హనుమకొండ జిల్లా అధ్యక్షుడుగా దొంతుల ఈశ్వరయ్య ఎన్నిక ఆవోపా హనుమకొండ జిల్లా అధ్యక్షుడుగా దొంతుల ఈశ్వరయ్య ఎన్నిక
హనుమకొండ(లోకల్ గైడ్): ఆర్య వైశ్యుల అభివృద్దే తన లక్ష్యమని ఆర్యవైశ్య అఫిషిషల్అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఆవోపా) హనుమకొండ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఆదివారం ఎన్నికైన దొంతుల ఈశ్వరయ్య...
సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా...
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం...
రైళ్లలో సెల్ ఫోన్లు చోరీ చేసే దొంగ అరెస్ట్...
ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ 
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం