మారెమ్మ అమ్మ  వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే 

మారెమ్మ అమ్మ  వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే 

గద్వాల, లోకల్ గైడ్ :
గద్వాల నియోజకవర్గం కె.టి దొడ్డి మండలం కొండాపురం గ్రామంలో గ్రామదేవత  మారెమ్మ అవ్వ దేవర సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేకి గ్రామనాయకులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని గ్రామ దేవతలను పూజించడం వల్ల గ్రామానికి ఇలాంటి చెడు పడకుండా గ్రామంపై ఎలాంటి నరదృష్టి రాకుండా గ్రామదేవతలు కాపాడడం జరుగుతుందన్నారు. గ్రామంలో ప్రతి ఇంట్లో దేవర సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. గ్రామదేవతలు ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరానన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, మాజీ  జెడ్పిటిసి రాజశేఖర్ , నాయకులు ఉరుకుందు, శేఖర్ రెడ్డి, చంద్రశేఖర్, రాజేష్, తిమ్మారెడ్డి శేఖర్ రెడ్డి,  పవన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

నిజామాబాద్ అర్బన్ మహాత్మజ్యోతి బాపూలే కళాశాలను నిజామాబాద్ అర్బన్ మహాత్మజ్యోతి బాపూలే కళాశాలను
సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావ్...
ఇంకుడు గుంతలో పడి రెండున్నర ఏళ్ల బాలుడు మృతి....*
సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం...
భారీ ఎత్తున కల్తీ కల్లులో కలిపే మత్తు పదార్థాలు పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు...
నేషనల్ హైవే దాబాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు...
పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం...
గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళ, ఇద్దరు యువకుల అరెస్ట్...