సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం...
మగ పులిగా గుర్తించిన అటవీశాఖ అధికారులు...
*ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
అటవీ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం... అటవీ శాఖ అధికారులు...* నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: సిరికొండ (లోకల్ గైడ్)
నిజామాబాద్ రూరల్ పరిధిలోని సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి పంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు..గత ఐదారు నెలల నుండి జగిత్యాల జిల్లా, కొడిమ్యాల రేంజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రేంజ్ పరిదిలో తిరుగుతు నిజమాబాద్ జిల్లా సిరికొండ రేంజ్, కమ్మర్పల్లి రేంజ్ పరిదిలోని తాట్ పల్లి , బీటులోని మల్లం కుంట చెరువు మరియు జనిగ్యాల అట్లకుంట చెరువు ప్రాంతంలో తిరుగుతుందని విశ్వాసనీయ సమాచారం మేరకు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఆర్మూర్ ఇ. భవాని శంకర్ మరియు మరియు సిరికొండ, కమ్మర్ పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి.రవిందర్, రేంజ్ సిబ్బంది, ఎనిమిల్ ట్రాకర్స్, ఎన్జీవో వెంకట్, అట్టి ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించగా పులి అడుగు జాడలను పరిశీలించి పెద్దపులిగా మగపులిగా నిర్ధారణ చేసినట్టు తెలిపారు. ఇట్టి పులి ఖానాపూర్, ఏరియాలో ఫారెస్ట్ సంచరిస్తుండేదన్నారు. ఇట్టి పులికి ఎస్ 12గా పిలుస్తారన్నారు. కాబట్టి చుట్టు ప్రక్కల సిరికొండ, భీంగల్, కమ్మర్పల్లి మండల ప్రజలు పశువుల కాపరులు అఢవికి దగ్గరలో వున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. పులియొక్క ఆనవాల్లు కనిపించినచో అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు తెలిపారు.. రైతులు పోలాల చుట్టు కరెంటు వైర్లు బిగించరాదని సూచించారు . ఇట్టి ప్రాంతంలో అటవి అధికారులు మరియ ఎనిమల్ ట్రాకర్స్ ప్రతిరోజు తిరుగుతూ పులియుక్క కదలికలను గుర్తించడం జరుగుతుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, పులికి ఎటువంటి హాని కలిగించవద్దని తెలిపారు..
About The Author
Related Posts
