భారీ ఎత్తున కల్తీ కల్లులో కలిపే మత్తు పదార్థాలు పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు...

భారీ ఎత్తున కల్తీ కల్లులో కలిపే మత్తు పదార్థాలు పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు...

అదుపులో నిందితులు...దర్యాప్తు చేస్తున్న అధికారులు.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్).. కల్తీ కల్లు లో కలిపే మత్తు పదార్థాల రవాణా జరుగుతుందన్న నమ్మ దగ్గ సమాచారం మేరకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశానుసారం ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న మరియు  ఎస్సై మరియు బృందం ఆధ్వర్యంలో రాత్రి నుండి నిఘా పెట్టీ లక్షల్లో విలువ చేసే భారీగా అల్ప్రాజోలం, క్లోరో హైడ్రేడ్ ఎక్సైజ్​ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పట్టుకున్నట్టు సమాచారం.... ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి మరియు స్వప్న ఎస్సై మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నైపెట్ మండలం నాడాపూర్ గ్రామంలోని నర్సాగౌడ్ మరియు వెంకట్ గౌడ్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు తెలిసింది  అలాగే రుద్రూర్ మండలానికి చెందిన బొంబాయి రాజా గౌడ్ లను సైతం పట్టుకొని వారి నుండి కల్తీ కల్లులో కలిపే ఆల్ఫాజోలం, క్లోరోహైడ్రేడ్ ను స్వాధీనం చేసుకోని నిందితులపై కేసు నమోదు చేసి పూర్తిగా నిందితులకు మత్తు పదార్థాలను సరఫరా చేసే ముఠా సభ్యులను పట్టుకునే పనిలో అధికారులు పడ్డారు.. ఇదిలా ఉండగా నిజామాబాద్ రూరల్ పరిధిలోని కాలూర్ ప్రాంతంలో భారీ ఎత్తున అల్పాజోలం పట్టుకున్నట్టు తెలిసింది..
ఒక పక్క హైదరాబాదులో ఇటీవల కాలంలో కొందరు కల్తీ కల్లుతో మృతి చెందడంతో పాటు,కామారెడ్డి బాన్సువాడ నియోజక వర్గ పరిధిలో సైతం పలువురు అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే...కల్తీ కల్లు కావాలని ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే...వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ 
జిల్లాల్లో నిషేధిత అల్ప్రాజోలం, మత్తు పదార్థాలు పట్టుబడడం గమనార్హం... మత్తుపదార్థాల రవాణా అంతా కల్తీకల్లు మాఫియా తోనే జరుగుతోందనేది ప్రతి ఒక్కరికీ తెలిసిందే..దశాబ్దాలు గడుస్తున్నా కల్తీ కల్లులో కలిపే మత్తు పదార్థాలు ఒకటి లేకపోతే మరొకటి చివరికి వైట్నర్ ,నిద్ర మాత్రలు, యూరియా కూడా కలిపిన ఘటనలు లేకపోలేదు... దీంతో అమాయక శ్రమజీవులు దీనికి బానిసలుగా మారుతున్నారు. అనేక దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు...

Tags:

About The Author

Related Posts

Latest News

నిజామాబాద్ అర్బన్ మహాత్మజ్యోతి బాపూలే కళాశాలను నిజామాబాద్ అర్బన్ మహాత్మజ్యోతి బాపూలే కళాశాలను
సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావ్...
ఇంకుడు గుంతలో పడి రెండున్నర ఏళ్ల బాలుడు మృతి....*
సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం...
భారీ ఎత్తున కల్తీ కల్లులో కలిపే మత్తు పదార్థాలు పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు...
నేషనల్ హైవే దాబాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు...
పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం...
గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళ, ఇద్దరు యువకుల అరెస్ట్...