నేషనల్ హైవే దాబాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు...
మద్యం సిట్టింగ్ లకు అనుమతిస్తున్న పలు దాబాల నిర్వాహకులపై కేసులు నమోదు...
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు దాబా లపై పోలీస్ కమీషనర్ ఆదేశానుసారం టాస్క్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు..ఈ దాడుల్లో భాగంగా నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు ఎస్సై గోవింద్ మరియు సిబ్బంది
మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే పై RNM ధాబా లో అనుమతి లేకుండా మద్యం సిట్టింగ్ అనుమతిస్తున్నందున దాబా హోటల్ పై రైడ్ చేసి మద్యం స్వాధీనం చేసుకొని RNM దాబా ఓనరు రొయ్యల నాగభూషణంను మరియు సీజ్ చేసిన మద్యాన్ని తదుపరి చర్య నిమిత్తం మోర్తాడ్ SHO కి అప్పగించారు..
అలాగే వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గల నేషనల్ హైవే పై మయూరి ధాబాయందు ఎలాంటి అనుమతి లేకుండా మద్యం సిట్టింగ్ అనుమతిస్తున్నందున ఢాబా హోటల్ రైడ్ చేసి మద్యం స్వాధీనపరచుకొని మయూరి దాబా ఓనరు అగ్గు మైపాల్ మరియు సీజ్ చేసిన మద్యాన్ని తదుపరి చర్య నిమిత్తం వేల్పూర్ పోలీస్ స్టేషన్ SHOకి అప్పగించారు..
About The Author
Related Posts
