పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :

 

కొత్తగూడెం : లోకల్ గైడ్ : 
జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్‌హెచ్‌ఓలు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ పాత కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తమ ఉన్నతాధికారులకు తెలియజేస్తూ ఉండాలని సూచించారు.
కేసులకు సంబంధించి ఏవైనా సందేహాలు తలెత్తితే డీసీఆర్‌బీ అధికారులకు తెలియజేసి వాటిని నివృత్తి చేసుకోవాలని తెలిపారు. కేసు నమోదైనప్పటి నుంచి పరిష్కారం అయ్యే వరకు ప్రతి అంశాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరచాలని టెక్ టీం ఆపరేటర్లకు సూచించారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసే క్రమంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఐటీ సెల్ సహకారం తీసుకోవాలని అన్నారు. 5 ఎస్ అమలులో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కేసులకు సంబంధించిన ఫైళ్లను క్రమపద్ధతిలో అమర్చుకోవాలని సూచించారు. నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి బాధితులకు న్యాయం చేకూర్చడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాస్, ఎస్‌బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నల్లగొండ ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నల్లగొండ ప్రజలకు
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి:మార్చి 16 (లోకల్ గైడ్) నల్లగొండ పట్టణ ప్రజలకు నాణ్యమైన వస్తువులు, సరుకులు సరసమైన ధరలకు అందించి ప్రజల మన్ననలు పొందాలని
అభివృద్ధి పనులకు భూ కేటాయింపు త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
తమ్ముడి మృతికి కారణమైన అన్న అరెస్టు.
సీపీఐ(ఎం) పార్టీ నాయకురాలు మాడె సుభద్ర మృతి
పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :
అసెంబ్లీ సమావేశాల్లో " ఆశవర్కర్స్ "సమస్యల గురించి చర్చించాలి
ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వర పరిష్కారం చేయాలి: