జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రత్యేక అభివృద్ధి పనులు
By Ram Reddy
On
హనుమకొండ జిల్లా (లోకల్ గైడ్): హనుమకొండ జిల్లాలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ తరగతుల వసతులను శుక్రవారం రోజున వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి , ఎమ్మెల్యే స్టేషన్ ఘనపూర్ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వర్ధన్నపేట కే ఆర్ నాగరాజు ,నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, కమిషనర్ చౌహాన్ బాజ్ పాయ్ పరిశీలించారు.ఆయా శాఖల అధికారులతో కలిసి స్టేడియంలో ఉన్న బాలుర,బాలికల వసతి గృహాలను పరిశీలించారు.రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ లో ని హకీంపేట లో మాత్రమే ఉన్నదని అంతే హంగులతో కూడిన రెండో క్రీడా పాఠశాల ఏర్పాటు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్న క్రమంలో స్థానికంగా ఉన్న శాసనసభ్యులు, అధికారులు అందరూ కలిసి ముందుకు వెళ్తామని అన్నారు.మొదటి దఫా క్రీడా పాఠశాల తరగతుల ఏర్పాటుకు విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు, వసతులు పట్ల కచ్చితమైన ప్రణాళికల్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
Tags:
About The Author
Related Posts

Latest News
01 Aug 2025 18:53:28
లోకల్ గైడ్ (తాండూర్); దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు జిల్లావ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది.ప్రమాదం జరిగిన ఆపదలో ఉన్నవారికి సంజీవినిలా...