కేసీఆర్ పాలనలోనే రూ.34 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు...
మధిర ప్రాంత ప్రజలకు 100 పడకల ఆసుపత్రి అందించిన ఘనత BRS పార్టీదే...
ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయినా రెండేళ్లకు ప్రారంభోత్సవం చేయడం ఎన్నికల స్టంట్..
మధిర ఖమ్మం జిల్లా,లోకల్ గైడ్:-
మధిర లో 100 పడకల ఆసుపత్రికి కేసీఆర్ పాలనలోనే రూ.34 కోట్ల రూపాయలు కేటాయించారని అలానే నిర్మాణ పనులు కూడా BRS ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని మాజీ జడ్పీ చైర్మన్,BRS పార్టీ మధిర అసెంబ్లీ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. మంగళవారం నాడు మధిర లోని 100 పడకల ఆసుపత్రి వద్ద ఆసుపత్రి ప్రధాత కేసీఆర్ చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలసి ఆయన పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర ప్రాంత ప్రజలకు 100 పడకల ఆసుపత్రి అందించిన ఘనత కెసిఆర్ BRS పార్టీకి, కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయి రెండేళ్లు గడుస్తున్నా హస్తం ప్రభుత్వ నేతలు ప్రారంభించడానికి ముందుకు రాలేదని కేవలం ప్రజల్లో కేసీఆర్ కట్టించిన ఆసుపత్రి అనే ముద్ర ఉండడమే అందుకు కారణమన్నారు.ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయం లో వచ్చి ప్రారంభించడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే అని సొమ్ము ఒకడిది,సోకు ఒకడిది అన్నట్లు ప్రారంభోత్సవ హడావుడి ఉందన్నారు.కేసీఆర్ ఆనవాళ్లు కనపడకుండా చేస్తాం అనే కాంగ్రెస్ నాయకులు మరి కేసీఆర్ కట్టించిన 100 పడకల ఆసుపత్రిని ఏం చేస్తారని ప్రశ్నించారు. మధిర మున్సిపాలిటీ లో కేసీఆర్ ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయని ప్రజల్లో వాటికి మంచి ఆదరణ వచ్చిందని అవే మున్సిపల్ ఎన్నికల్లో BRS పార్టీకి శ్రీరామరక్ష అన్నారు.ఈ కార్యక్రమం లో పట్టణ పార్టీ అధ్యక్ష్య,కార్యదర్శులు పల్లపోతు వెంకటేశ్వరరావు,అరిగే శ్రీనివాసరావు,మండల పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు,మాజీ సొసైటీ చైర్మన్ బిక్కీ కృష్ణప్రసాద్,మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ యన్నంశెట్టి అప్పారావు,మాజీ శివాలయం కమిటి చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, తాళ్లూరి హరీష్ బాబు,మండల యూత్ అధ్యక్షుడు అబ్బూరి రామన్,మాజీ కౌన్సిలర్లు ఇక్బల్,మాధవి,నాయకులు భువనగరి నారాయణరావు,కపిలవాయి జగన్మోహన్ రావు,ఆళ్ల నాగబాబు,వేల్పుల శివ, నాగులవంచ రామారావు,పెద్ద చంటి,చిదిరాల రాంబాబు,జల్లా ప్రవీణ్,సీతారామయ్య, అంగడాల పార్వతి,గోగులోతు కృష్ణ,కొత్తపల్లి నరసింహరావు,రెడపంగి స్వామి,గోపాల్, పరిసా శ్రీనివాసరావు,అబ్దుల్ కూరేష్,సైదా, దిల్ కుమార్,అంగడాల గోపి,లంకెమళ్ల నాగేశ్వరరావు,రమేష్,తదితరులు, పాల్గొన్నారు..
