కన్యక పరమేశ్వరి త్యాగం గొప్పది. - ప్రతి ఒక్కరు ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలి.
మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి.
ఘనంగా కన్యకా పరమేశ్వరి ఆత్మహర్పణ దినోత్సవ వేడుకలు.
లోకల్ గైడ్/తాండూర్:
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి త్యాగం ఎంతో గొప్పదని తాండూర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి కొనియాడారు. మంగళవారం తాండూరు పట్టణంలోని శ్రీ నగరేశ్వర దేవాలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలను... ఆలయ ప్రాంగణంలో పాలకమండలి, మహిళా సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆలయ కమిటీ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ లు విజయలక్ష్మి, స్వప్న పరిమల్ హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి కుంకుమార్పన, దీపారాధన, అభిషేకం, హోమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి, స్వప్న మాట్లాడుతూ... వాసవి కన్యకా పరమేశ్వరి త్యాగపలమే నేడు 108 కుల గోత్రాలు ఒక తాటిపైన నిలబడ్డారని తెలిపారు. అంతేకాకుండా వైశ్యులు అన్ని రంగాలలో రాణిస్తున్నారంటే అందుకు కారణం ఆమె త్యాగ ఫలమేనని కీర్తించారు. ఫలితంగా ఆర్యవైశ్య సమాజం వ్యాపారం, సేవారంగం, రాజకీయ, ఆర్థిక, రంగాలలో పురోగతి సాధించడం చాలా సంతోషమని అన్నారు. ఇంకా భవిష్యత్తులో అమ్మవారి ఆశీర్వాదంతో అన్ని రంగాలలో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
