ప్రజల గుండెల్లో నిలిచిన డైనమిక్ సీఐ — నిండుగొండ శ్రీరామ్!
నీతికి నిలువెత్తు సాక్షం… సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న బుడగజంగాల రత్నం.
By Ram Reddy
On
తమ జాతి బిడ్డకు అండగాఉంటామని బేడ బుడగజంగాల హక్కుల దండు అధ్యక్షులు కడమంచి ముత్తయ్య
హైదరాబాద్, 15 ఫిబ్రవరి (లోకల్ గైడ్ ప్రతినిధి)
బుడగజంగాల సమాజానికి గర్వకారణంగా ఎదిగిన శ్రీరామ్ సార్, క్రమశిక్షణతో పాటు కరుణను కలగలిపిన వ్యక్తిత్వం. నేరస్తులపై కఠినంగా, నిరుపేదలపై మమకారంగా వ్యవహరించడం ఆయన ప్రత్యేకత.ఇటీవల సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ లలో ఆయన వీడియోలు వైరల్ అవుతూ, వేలాది యువతను ఆకట్టుకుంటున్నాయి. యువత ఆయన వీడియోలపై లైకులు, షేర్లు, కామెంట్లతో విపరీతమైన మద్దతు తెలియజేస్తున్నారు.
"నీతికి నిలువెత్తు సాక్షం శ్రీరామ్ సార్", "నిజాయితీ అంటే నిండుగొండ శ్రీరామ్" అంటూ సోషల్ మీడియా అంతా ప్రశంసల వర్షం కురుస్తోంది.ఇక ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, బుడగజంగాల సంఘాల నాయకులు శ్రీరామ్ సీఐ నిజాయితీని, సేవా ధృక్పథాన్ని ప్రశంసించారు. సమాజ అభివృద్ధికి ఇలాంటి అధికారులే ఆదర్శమని వారు తెలిపారు.ఈ సందర్భంగా బుడగజంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముత్తయ్య మాట్లాడుతూ –మన జాతి గర్వకారణమైన బిడ్డ నిండుగొండ శ్రీరామ్ సార్ ఎల్లప్పుడూ మా తోడుగా ఉంటారు. ఆయనపై ఏవైనా కష్టాలు వచ్చినా, మేమంతా ఆయన వెన్నంటి నిలుస్తాం” అని స్పష్టం చేశారు.
అలాగే బుడగజంగాల యువజన ప్రెసిడెంట్లు, యువ నాయకులు కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ, “శ్రీరామ్ సార్ లాంటి నిజాయితీ గల అధికారి మా జాతికి గౌరవం తీసుకువచ్చారు. మేము ఎప్పుడూ ఆయనకు తోడుగా ఉంటాం” అని పేర్కొన్నారు.బుడగజంగాల యువత ఐక్యంగా ముందుకు రావాలని, శ్రీరామ్ సార్ చూపిన మార్గంలో నడవాలని పలువురు పిలుపునిచ్చారు.ప్రజా సేవ పట్ల అంకితమైన ధోరణితో “డైనమిక్ సీఐ — ప్రజల హృదయాల్లో సింహం”గా నిలిచిన నిండుగొండ శ్రీరామ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియా నుండి ప్రజల మదిలో మార్మోగుతోంది.
Tags:
About The Author
Latest News
27 Feb 2026 20:19:01
భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :చర్ల మండల కేంద్రంలో ఉన్న రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో శుక్రవారం రాహుల్ హై స్కూల్ విద్యార్థులకు కేంద్ర రిజర్వ్...
