శంకరుడి "చేతి"లో త్రిశూలం.. కాంగ్రెస్ విష్ణు చక్రం..
అన్నింటా అందెవేసిన చేయి అందె మోహన్.. కాంగ్రెస్ పార్టీలో చురుకైన యువ రత్నం..
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతి వజ్రాయుధం.. మున్సిపల్ చైర్మన్ గా గట్టెక్కేనా..? కాంగ్రెస్ భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచి అందేమోహన్
లోకల్ గైడ్ తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా
రాజకీయాల్లో యువశక్తి ఎదిగితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు.. అలాంటి యువశక్తి శంకర్ చేతిలో త్రిశూలంలో కదం తొక్కితే.. అర్జునుడి చేతిలో బాణంలా దూసుకుపోతే.. విష్ణుమూర్తి చేతిలో చక్రంలా వేగాన్ని ప్రదర్శిస్తే.. పార్టీకి జవసత్వాలు వస్తాయి.. అలాంటి యువ రక్తం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వేగంగా పావులు కదుపుతుంది. ఆ యువ రక్తం పేరు అందెమోహన్. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది కుటుంబంలో నుండి పుట్టిన అందేమోహన్ యువనేతగా పార్టీలో అడుగుపెట్టి చురుకుదనంతో, ఉత్సాహంతో పార్టీకి వెన్నుముకల నిలుస్తు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు కూడా అన్నింటా అండగా ఉంటూ అత్యంత సన్నిహితుడుగా ఎదుగుతున్నాడు. ఇంతింతై ఎదుగుతున్న ఈ యువనేత
మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఢమకాతో గెలిచాడు. మున్సిపల్ చైర్మన్ రేస్ లో ఉన్న అందేమోహన్ గెలిచాక స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు పొందాడు. ఇప్పుడు శంకర్ ఆశీస్సులు అందేమోహన్ కు ఎంత మేరకు పనిచేస్తాయి పార్టీని పలోపేతం చేసే దిశగా అందేమోహన్ కు చైర్మన్ పీఠం దక్కుతుందా లేదా అన్నది పార్టీ వర్గాలకే తెలియాలి. ఓసారి పరిశీలిస్తే..
నాటి మోహన్..
కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని కాలంలోనే పార్టీలోకి అడుగుపెట్టి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు అన్ని రకాలుగా అండగా నిలిచి పార్టీలో తనదైన ముద్ర వేశాడు అందెమోహన్. పార్టీలోకి యువ కార్యకర్తలను, నాయకులను తీసుకువచ్చి యువ నాయకుడిగా అన్ని కార్యక్రమాలను ముందుండి నడిపించాడు. పెద్ద పెద్ద కార్యక్రమాలకు కార్లన్ని ఏర్పాటు చేయడం నుంచి, తమ ప్రియతమ నాయకుడు సెక్యూరిటీ వాహనాల దాకా ప్రతి అడుగు తానై ముఖ్యంగా చెప్పాలంటే శంకర్ కు సైరాన్ తానై బ్రదర్ నడిపించాడు. అసెంబ్లీ ఎన్నికల్లోను అంకితభావంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశాడు. నియోజకవర్గ నలుమూలల ఉన్న యువకులను ఏకం చేసి పార్టీ బలం పెంచడంలో అందెమోహన్ ది కీలకపాత్ర.
ప్రతి పక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అధికార పార్టీ చేతిలో ఎంతో నలిగిపోయాడు. అనేక కేసులు నిర్బంధాలు ఆర్థికంగా కష్టనష్టాలు ఎదుర్కొన్నాడు.
పట్టణంలో యువతను పోగుచేసి తన సామర్థ్యాన్ని చాటుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి జవసత్వంలా మారాడు. కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడిగా ముఖ్యపాత్ర పోషించి పట్టణంలో యువతను సమీకరించాడు. భవిష్యత్తు రాజకీయాల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఇలాంటి నాయకులను రాజకీయంగా అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం జరగక తప్పదు.
నేటి మోహన్..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు అన్ని విధాలుగా అండగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి కార్యక్రమానికి భారీ ఎత్తున నేతలను, కార్యకర్తలను పోగుచేసి నియోజకవర్గంలో పార్టీ వైభవాన్ని, ప్రతిష్టను మరింత పెంచాడు. ఇక తాజాగా మున్సిపాలిటీ ఎన్నికల్లో అతన్ని పూర్తిస్థాయిలో నమ్మిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 14వ వార్డు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాడు. యువతను, మహిళలను తన వైపు తిప్పుకొని 28 వార్డులలో అత్యధిక మెజారిటీ తన వార్డు నుంచి వచ్చేలా కృషి చేశాడు. 767 ఓట్ల మెజారిటీతో భారీ విజయని సాధించి మరోసారి తాను ఏమిటో నిరూపించుకున్నాడు. అందెమోహన్ రాజకీయ ప్రాబల్యాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు, అధిష్టానం కూడా నిశితంగా గమనిస్తుంది. భవిష్యత్తులో మంచి పదవుల ద్వారా ఉన్నత స్థానాన్ని అందుకునే అవకాశాలు ఈ యువ నాయకుడు అందెమోహన్ కు స్పష్టంగా ఉన్నాయి. అందమోహన్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో సదరు సామాజిక వర్గం నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది..
