సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలలో పాల్గొన్న డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్
పాండురంగాపురం సేవాలాల్ మహారాజ్ ఆలయం నందు ఆలయ నిర్వహణ
ఖమ్మం:లోకల్ గైడ్:
ఖమ్మం : సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి సందర్భంగా స్థానిక పాండురంగాపురం సేవాలాల్ మహారాజ్ ఆలయం నందు ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్ పాల్గొని మాట్లాడారు . లంబాడీల్లో జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ . ప్రజల మేలు కోసం ఆయన అనేక ఉద్యమాలు చేశారు . బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను జోడిస్తూ దేశమంతా సంచరిస్తూ హితబోధ చేశారు . ఊరికి దూరంగా అడవిలో స్థిరమైన తండా వ్యవస్థను పటిష్ఠంగా నిర్మాణం చేసి జాతి ఐక్యత కోసం ఎంతో కృషి చేశారు . మూఢనమ్మకాలు , మాంసాహారం మద్యం వంటివి దూరంగా ఉండాలని పశుసంపదను అభివృద్ధి చేయాలని తోటి వారిని గౌరవిస్తూ ఆరోగ్యంగా ఉండాలని సమాజంలో గిరిజన జాతికి ఒక గౌరవం వన్నె తీసుకొచ్చిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు దీపక్ చౌదరి , మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు , ఆత్మ కమిటీ చైర్మన దిరిశాల వెంకటేశ్వరరావు , నాలుగో డివిజన్ కార్పొరేటర్ దండ జ్యోతి రెడ్డి , ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు మూడు బాల్ సింగ్ , ప్రధాన కార్యదర్శి మంగ్య నాయక్ , చక్రవర్తి నాయక్ , హతిరాం నాయక్ , మంగీలాల్ జాదవ్ , ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి బిక్షపతి రాథోడ్ , ఉపాధ్యాయ సంఘాల రాష్ట్రనాయకులు బానోత్ వీరు నాయక్ , ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ , రామారావు , పాపాలాల్ , సీతారాం , దేవ్ సింగ్ , బాలాజీ కిషన్ రాథోడ్ , బన్సీలాల్ , వీరన్న తదితరులు పాల్గొన్నారు .
