ప్రభుత్వం నిర్వహించబోతున్న విజయోత్సవాలలో నిరసన తెలియజేస్తాం.
బీజేపీ రాష్ట్ర నాయకులు గోలి ప్రభాకర్.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. ఏప్రిల్ 4. (లోకల్ గైడ్).
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతున్న విజయోత్సవాలలో నిరసన తెలియ చేస్తాం అని బీజేపీ రాష్ట్ర నాయకులు తెలంగాణ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోలి ప్రభాకర్ డిమాండ్ చేసారు. తెలంగాణ దివ్యాoగులకు ఎన్నికల సమయంలో కాంగ్రేస్ మ్యానిపెస్టో లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసేలా ప్రభుత్వం పైన పోరాటం చేసేందుకు ఏర్పటైనా మ్యానిపెస్టో సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం ఉదయం హైదరాబాద్ చైతన్యపురి మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన వివిధ వికలాంగుల సంఘాల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు టీవీహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోలి ప్రభాకర్ మాట్లాడారు .ఈ సందర్బంగా ఈ నెల ప్రభుత్వం 22 న ప్రభుత్వం నిర్వహించబోతున్న విజయోత్సవ కార్యక్రమాలలో దివ్యాoగులు నిరసనలు తెలియచేయాలనీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు *అధికారం లోకి వచ్చిన వెంటనే పింఛను మొత్తాన్ని 6 వేలకు పెంచి ఇస్తామని ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని బ్యాకలాగ్ పోస్టులు బర్తీ చేస్తామని వికలాంగుల అందరికి ఇండ్లు, ఉపాధి వంటి ఎన్నో హామీలు మ్యానిపిస్టో లో చేర్చి అధికారంలోకి వచ్చిన తరువాత వికలాంగులను పట్టించుకోవడం లేదని విమర్శించారు అధికారంలోకి వచ్చి మూడేళ్ల్లు కావస్తున్న ఇంకా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టకపోవడం వల్ల వికలాంగుల హామీల సాధనకై ప్రభుత్వం పైన వత్తిడి తెచ్చేందుకు కాంగ్రేస్ మ్యానిపిస్టో సాధన సమితి ఏర్పడింది తదుపరి కార్యాచరణ రూపొందించుటకొరకు శనివారం జరిగిన సమావేశంలో గోలి ప్రభాకర్ పాల్గొని మాట్లాడి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని అన్నారు.ఈ సమావేశం చెరుకు నాగభూషణం అధ్యక్షతన జరగగా వంశరాజ్ రామ్ చందర్ కొల్లి నాగేశ్వర్ రావు ఆంజనేయులు గౌడ్ మల్లేష్ యాదవ్ కోలా రాజ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
