జనహిత అన్నపూర్ణ ఆద్వర్యంలో అన్నదానం
By Ram Reddy
On
జనహిత సేవా సమితి జనహిత అన్నపూర్ణ ఆద్వర్యంలో 399వ సారి బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తా వద్ద పేరపల్లి ఉదయ్ కుమార్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతు యాచకులు,నిరుపేదలు,కూలీలు,చిరువ్యాపారులు,బాటసారులకు ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి దాతలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు.జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం విజయవంతానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని,సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు,జనహిత సేవా సమితి ఉపాధ్యక్షుడు కందుల రాజన్న,సహాయ కార్యదర్శి పంతంగి సంతోష్,కార్యవర్గ సభ్యులు భీమిని కనకయ్య గౌడ్,నిచ్చకోల గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
17 Apr 2026 20:26:09
నారాయణపేట ఏప్రిల్ 17:
కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
