ఉద్యమ కారుల గుర్తింపు కై చట్ట బద్దత కమిటీని ఏర్పాటు చేయాలి.

ఈ నెల 29న మహా దీక్షను విజయ వంతం చేయండి 

ఉద్యమ కారుల గుర్తింపు కై చట్ట బద్దత కమిటీని ఏర్పాటు చేయాలి.

రాష్ట్ర ఛైర్మెన్ గోధుమల కుమార స్వామి...వెల్లడి

హనుమకొండ జిల్లా ప్రతినిధి మార్చి26 లోకల్ గైడ్ 

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం వేంటనే రాజకీయాలకు అతీతంగ ఈ అసెంబ్లీ సమావేశలలో చట్ట బద్దత కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ హన్మకొండ లోని ప్రెస్ క్లబ్లో బుధవారం రోజున విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక రాష్ట్ర ఛైర్మెన్ కుమార స్వామి అధ్యక్షత వయించి గత ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిదని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తన మ్యానిఫెస్టోలో  ఉద్యమ కారులను గుర్తిస్తామని ప్రకటనలతో పరిమిత మైనదని ప్రకటనతో పరిమితం కాకుండ ఈ అసెంబ్లీ సమావేశలలో ఉద్యమకారులను గుర్తించుటకు రాజకీయాలకు అతీతంగా చట్ట బద్దత కమిటీని ఏర్పాటు చేయాలనీ కోరుతూ ఈ నెల 29ఆదివారం రోజున హన్మకొండ లోని ఏకాశీల పార్క్ ( ధర్నా చౌక్ ) దగ్గర తలపెట్టిన మహా దీక్షను విజయ వంతం చేయాలని ఉద్యమకారులకు పిలుపు నీచ్చారు. ఈ సమావెశంలో  సీనియర్ సామాజిక ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షలు ప్రొఫెసర్ వెంకటనారాయణ  మాట్లాడుతు ఉద్యమకారులను గుర్తించుటకు కాలయాపన చేయడం ఉద్యమకారులలో నిరాశ ఏర్పడుతుందని ఆలస్యం చేయకుండ వెంటనే రాజకీయ పార్టీలకు అతీతంగ చట్ట బద్దత కమిటీని ఏర్పాటు చేయాలని మహా దీక్షను జయప్రదం చేయాలని కోరారు. సీనియర్ ఉద్యమకారులు సోమా రామూర్తి సామజిక ఉద్యమకారులు మాట్లాడుతూ ఉద్యమకారులు ఐక్యంగ ఉండి ఉద్యమకారుల అకాంక్షల కోసం ఈ నెల  29 ఆదివారం జరిగే మహదీక్షను          వియాయవంతం చేయాలని కోరారు. అలాగే ప్రొఫెసర్ మంద వీర స్వామి మాట్లాడుతూ ఉద్యమ కారులు ఐయిక్యంగ ముందుకు పోతేనే సమస్యలకు పరిస్కారం దొరుకుతుందని అన్నారు. ప్రభుత్వానికి తెలియచేయ వలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు అంకుశవాలి   ఎండి యాసిన్. హజి రాష్ట్ర నాయకులు నవరత్న ఆనంద్, సి పి యుస్ ఐ నాయకులు గడ్డం శరత్, దారా సూరి,హన్మకొండ అధ్యక్షులు గౌస్. బాబు, స్వర్ణ లత, మాజీ కార్పొరేటర్ నయీమ్, దస్తగిరి, కాజిపేట ఉద్యమ నాయకులు కృష్ణమూర్తి, జక్కుల స్వామి యాదవ్, వరంగల్ ఉద్యమ నాయాకులు మోహన చారీ,బిక్సపతి ఆర్టీసీ ఉద్యమ నాయకులు దొమ్మటి రవీందర్. మహిళా నాయకురాలు దేవి ఆటో యూనియన్ నాయకులు ప్రకాష్ కాజిపేట ఉద్యమ నాయకులు గోపనబోయిన రాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
    వెంకటాపురం : లోకల్ గైడ్ :ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామపంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల కోసం ఎలకల రామారావు ఆధ్వర్యంలో టేబుల్,
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం 
భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.
ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన