ప్రజా సంక్షేమాన్ని విస్మార్సించిన రాష్ట్ర బడ్జెట్

-రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సవరించాలి

ప్రజా సంక్షేమాన్ని విస్మార్సించిన రాష్ట్ర బడ్జెట్

-కొండబోయిన నాగేశ్వరరావు 


ఖమ్మం జిల్లా, కారేపల్లి :లోకల్ గైడ్, మార్చి 22

: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తోంది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను దగా చేసింది 2026,27 సంవత్సరానికి అసెంబ్లీలో   మూడోసారి ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ 3,24,233 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో శాఖల వారి కేటాయింపులు చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంకెల గారడి తప్ప ప్రజా సంక్షేమానికి ఏమాత్రం చిత్తశుద్ధి కనిపించట్లేదు సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు విమర్శించారు,ఆదివారం కే నరేంద్ర అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు 6 గ్యారెంటీలు 420 హామీల అమలకు 50 వేల 713 కోట్ల రూపాయలు ఏమాత్రం సరిపోయేది కాదు తక్షణమే బడ్జెట్ నిసవరించాలని ఆయన అన్నారు.వృద్ధులకు వితంతువులు 4000 పెన్షన్,వికలాంగుల 6000 వేల పెన్షన్ మహిళలకు 2500. భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏడాదికి 12,000  ఊసే లేదు,ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేదు వ్యవసాయ రంగానికి కేటాయించిన 23 వేల179 కోట్ల రూపాయలు కేటాయింపు చూస్తా ఉంటే వ్యవసాయ రంగంపై ప్రభుత్వానికి ఉన్నశ్రద్ధ తెలుస్తుంది మానవ అభివృద్ధికి దేశ అభివృద్ధి కి ఎంతో అవసరమైన విద్యారంగ అభివృద్ధికి కేటాయింపు నామ మాత్రమే ప్రభుత్వం విద్య రంగాన్ని కాపాడాల్సిన వారే బడ్జెట్ కేటాయింపు చూస్తుంటే ప్రైవేటు విద్య ప్రోత్సాహం వైపే మొగ్గు చూపుతుంది తీరు తెలుస్తుంది,అధికారంలోకొస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది తీరా ఇప్పుడు చూస్తే, 67,000 ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు అవి కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలే ఉన్నాయి అన్ని కలిపి,కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినకా విచ్చినవి కేవలం 20 వేల ఉద్యోగాలు మాత్రమే,ప్రజలు అత్యధికంగా అనారోగ్యాo సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రాధాన్యత కలిగిన వైద్య రంగానికి 13,679 కోట్ల రూపాయలు,పేదల వైద్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది,బడ్జెట్లో లక్షలాది కార్మికులు ఉన్న రాష్ట్రంలో 998 కోట్ల కేటాయించటం కార్మిక సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదు అంటానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశామని చెప్తుంది ప్రాజెక్టులు.పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా సంక్షేపదకాలు సక్రమంగా అమలు చేయకుండా అప్పు చేసిన డబ్బు దేనికి ఖర్చు పెట్టారో కూడా తెలియటం లేదు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో శాఖల వారి కేటాయింపులుచూస్తే ఉత్పత్తి రంగానికి నిధులు తగ్గిస్తూ ప్రాధాన్యత లేని రంగానికి నిధులు కేటాయించి కమిషన్లు కోసం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని విధంగా వ్యవహారాలు ఉన్నాయి తల్లితగ్గిరిజన తరగతుల సంక్షేమానికి నీతులు కోతపెట్టి   బడ్జెట్ అంకెల్లో సూపిస్తూ ప్రజలను  గారడి చేస్తున్నారు.గత బడ్జెట్  కేటాయింపులు కూడా అక్రమంగా ఖర్చులు చెయ్యలేదు,ఉపాధి హామీ పనులకు కేంద్రం తెచ్చిన వి బి జి రామ్ జి కొత్త స్కీం  ప్రకారం కేంద్రం 60 శాతం రాష్ట్రం 40 శాతం నిధులు కేటాయించాలని నిబంధన విధించింది,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామీణ పేదలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలకు కూడా 150 రోజులు పని కల్పిస్తామని రోజు కూలి 400 చెల్లిస్తామని హామీ ఇచ్చింది బడ్జెట్లో దాని ఊసు లేదు పేదలకు ఉపాధి పని దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది,కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ తులం బంగారం,విద్యార్థినులకు స్కూటీలు,ఉద్యోగ అవకాశం నిరుద్యోగులకి భృతి, రైతు రుణమాఫీ అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే వంటివి అమలు   వైపుగా ఏం కనిపించట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో కాలం వెళ్ళబుచుతూ మోసం చేస్తూ వస్తుంది రైతు భరోసా,దళిత గిరిజన వెనకబడిన తరగతుల సంక్షేమ  నిధుల్లో కూడా కోత పెడుతుంది,ఇది కోతల బడ్జెట్,కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక బడ్జెట్,అన్ని వర్గాల ప్రజలను విస్మరించిన బడ్జెట్ పునసమీక్షించి ప్రాధాన్యత రంగాలకు బడ్జెట్ను పెంచేలా ప్రస్తుత బడ్జెట్ సవరించాలని ఆయన డిమాండ్ చేశారు సమావేశంలో పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు వజ్జా రామారావు.భానోత్ బన్సీలాల్.దాసరి మల్లయ్య. తేజావత్ చందర్.దాసరి సైదులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం. నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం.
*       ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్    వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి...
సకల మానవాళికి ప్రమాదం యుద్ధం
జిల్లా వ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ అమలు.....
ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఘనంగా వివాహ వేడుక
46వ డివిజన్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజల మధ్యే సంక్షేమం…  నేరుగా లబ్ధిదారుల చేతికి కోట్ల చెక్కులు..
కార్మిక లేబర్ కోడ్ ల అమలును నిరసిస్తూ కాటేదాన్ చౌరస్తా