కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
By Ram Reddy
On
హనుమకొండ జిల్లా ప్రతినిధి మార్చి22(లోకల్ గైడ్
ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని 10వ, 8వ, తరగతి విద్యార్థినులతో మాట్లాడి, వారి చదువు ప్రగతిని, పరీక్షలకు సన్నద్ధతను గురించి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించాలని, లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కృషి చేయాలని సూచించారు.
అనంతరం స్టోర్ రూమ్‌ను పరిశీలించి బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల నిల్వలను తనిఖీ చేశారు. విద్యార్థినుల కోసం తయారు చేస్తున్న భోజనాన్ని కూడా పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు.
పాఠశాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రత్యేక అధికారి వాసవి కలెక్టర్‌కు వివరాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
02 Apr 2026 19:45:14
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా
కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
