పూలే కు చేయూత ఘన నివాళి
By Ram Reddy
On
నారాయణపేట ఏప్రిల్ 11:
మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా శనివారం నారాయణపేట లో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం వక్తలు మాట్లాడుతూ పూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహి ళోద్ధరణకు కృషి చేసాడ న్నారు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచ రులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశా డనీ తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు అని అతను అతని భార్య సావి త్రిబాయిఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గద ర్శకులు అయ్యారని అన్నారు. పూలే మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్య ను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడన్నారు. ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను1848లో పూణేలో ప్రారంభించాడనీ తెలిపారు.అంతేకాకుండా వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడనీ తెలిపారు.భారతదేశ బాలి కల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొదటి జంట వాటిదేనని అన్నారు.ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఈశ్వరమ్మ,ప్రధాన కార్యదర్శి టి.మాధవ్ ,కౌన్సిలర్ల మహేష్,భారత్ ,బండి రాజేశ్వరి,కాంగ్రెస్ నాయకులు బండి శివరామ్ రెడ్డి,సంస్థ ఉపాధ్యక్షుడు ప్రవీణ్ ,సభ్యులు రమేష్, సోఫీ ,చంటి,అనిత,శ్రీను తదితరులు పాల్గొన్నారు
ఫోటో రైట్ అప్:9.పూలెకు నివాళి అర్పించిన చేయూత సభ్యులు
____________________
Tags:
