ఏప్రిల్ చివరి నాటికి సీనియర్ హాస్టల్ భవనాలు బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలి... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
వైరా నియోజక వర్గ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
వైరా, ఏప్రిల్ -11:లోకల్ గైడ్ :
ఏప్రిల్ చివరి నాటికి సీనియర్ హాస్టల్ భవనాలు బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలని
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మాట్లాడుతూ* వైరా సాంఘీక సంక్షేమ గురుకులంలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. పనులు మంచి వేగంతో కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రణాళిక ప్రకారం 4 జూనియర్, 9 సీనియర్ హాస్టల్ బ్లాకులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జూనియర్ హాస్టల్ బ్లాకుల రాఫ్ట్ ఫౌండేషన్ పనులు జరుగుతున్నాయని, సీనియర్ హాస్టల్ బ్లాకు ఫౌండేషన్ పనులు ప్రారంభించి, పాత భవనాలను తొలగించి, ఏప్రిల్ నెలాఖరు నాటికి బేస్‌మెంట్ స్థాయికి తీసుకొనిరావాలని అధికారులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నా యని తెలిపారు. ఈ పాఠశాలల్లో జూనియర్, సీనియర్ హాస్టల్ బ్లాకులు, అకాడమిక్ బ్లాకులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి నివాస గృహాలు కూడా నిర్మించ బడుతున్నాయని అన్నారు. ఈ స్కూళ్లకు సంబంధించిన భూ సంబంధిత సమస్యలన్నీ పరిష్కరించామని, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.
కలెక్టర్ వెంట ఈడబ్ల్యుఐడిసి ఈఈ బుగ్గయ్య, వైరా మునిసిపల్ కమీషనర్ గురులింగం, తహసిల్దార్ సురేష్, సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
