తాను మరణిస్తూ...ఇద్దరి అందులకు చూపునిచ్చాడు.

తాను మరణిస్తూ...ఇద్దరి అందులకు చూపునిచ్చాడు.

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్11 లోకల్ గైడ్
 
 వరంగల్ రామన్నపేట బొడ్రాయి నివాసి ఇరుకుల్ల నాగభూషణం  85, శనివారం రోజున 
  అనారోగ్య వలన మరణించగా, వారి కుమారుడు వెంకటేశ్వర్లు , భార్య అఖిలాండేశ్వరి
సమాజ హితం కోరి, ‘’నేత్రదానం ‘’చేయడానికి అంగీకరించగా, తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్, ఆధ్వర్యంలో   వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఎల్వీ ప్రసాద్ సిబ్బంది నేత్ర సేకరణ  టెక్నీషియన్ రాజేంద్రప్రసాద్ ద్వారా నేత్రదానం కార్నియా సేకరణ చేయనైనది.
నాగభూషణం గారి నేత్రదానంతో ఇద్దరి అందులకు చూపునిచ్చిన వారైనారు,నేత్ర వైద్య విద్యకు తోడ్పడిన వారైనారు.కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలిపి  నేత్రదాన సర్టిఫికెట్ ఇవ్వనైనది.మరణానంతరం నేత్రదానం చేద్దాం సామాజిక బాధ్యత నెరవేర్చుకుందాం  మరణించినా... పునర్జన్మనిద్దాం!అని అసోసియేషన్ ప్రతినిధి  అన్నారు. వివరాలకు 8790548706, 8340892985' 9490133650 సెల్ నెంబర్లను సంప్రదించాల్సిందిగా  కోరినారు .ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, 
 అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కోన్ రెడ్డి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజేంద్రప్రసాద్  పాల్గొన్నారు. ‎
Tags:

About The Author

Latest News