నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి:

డీఎస్పీ నల్లపు లింగయ్య

నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి:

నారాయణపేట ఏప్రిల్ 11:
నేరాల నియంత్రణపై పోలీసులు దృష్టి సారించా లని నారాయణపేట డీఎస్పీ లింగయ్య అన్నారు. నారాయణపేట సర్కిల్, కోస్గి సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులతో డీఎస్పీ కార్యా లయంలో శనివారం నేర సమీక్షా సమావేశాన్ని నల్లపు లింగయ్య నిర్వహించారు. 
ఈ సందర్భంగా జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండిం గ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పరిష్కరించా లని అధికారులకు సూచించారు.
పెండింగ్‌లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులపై సమగ్రంగా చర్చిస్తూ, గ్రేవ్ మరియు నాన్-గ్రేవ్ కేసుల దర్యాప్తు విధానంపై సీఐలు, ఎస్సైలను అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు సమయంలో అనుసరించాల్సిన విధానాలు, సేకరించాల్సిన ఆధారాలు, ప్రామాణిక విధానాలు (ఎస్ ఓ పి) గురించి వివరంగా మార్గనిర్దేశనం చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ  మాట్లాడుతూ
ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం దర్యాప్తు జరిపి కేసులను ఛేదించాలని సూచించారు. కేసుల్లో శిక్షల శాతం పెంచేందుకు పటిష్ట ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేసు నమోదు నుండి చార్జ్‌షీట్ దాఖలు వరకు ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలించి పూర్తి పారదర్శకతతో దర్యాప్తు జరపాలని పేర్కొన్నారు.
అక్రమ ఇసుక రవాణా, గంజాయి, గుట్కా, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి వాటిని నిర్మూలించాలని ఆదేశించారు. ఫోక్సో, ఎస్సీ/ఎస్టీ, ఇతర గ్రేవ్ కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి 60 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు.ప్రతి పోలీసు అధికారి స్టేషన్ మేనేజ్‌మెంట్‌తో పాటు పూర్తి స్థాయి దర్యాప్తు పరిజ్ఞానం కలిగి ఉండాలని, కేసులను ప్రతిరోజు ఆన్లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. లాంగ్ పెండింగ్ కేసులను త్వరితగతిన ఛేదించాలని ఆదేశించారు.అరయివ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమాలు, సైబర్ నేరాలు, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 
ఈ సమావేశంలో సీఐలు శివశంకర్, సైదులు, ఎస్సైలు వెంకటేశ్వర్లు, రాజు, సతీష్ రెడ్డి, విజయ్, స్టేషన్ రైటర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:8.సమావేశంలో మాట్లాడుతున్న డిఎస్పీ
_______________________
Tags:

About The Author

Latest News