ఏసీబీ వలలో అవినీతి చేప!
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మమడ ఎస్సై అశోక్
నిర్మల్ : లోకల్ గైడ్ :
నిర్మల్ జిల్లా మమడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై అశోక్ అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని, ఏసీబీ (అంటీ కరప్షన్ బ్యూరో) అధికారుల వలలో పడిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. గురువారం జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో, లంచం స్వీకరిస్తున్న సమయంలో ఎస్సై అశోక్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
తరువాత జరిగిన బేరసారాల్లో ₹20,000కు ఒప్పందం కుదిరినట్లు అధికారులు తెలిపారు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఉచ్చుపన్నిన అధికారులు, ఎస్సై అశోక్ లంచం స్వీకరిస్తున్న సమయంలో అతను నివసిస్తున్న పోలీస్ క్వార్టర్స్‌లోనే పట్టుకున్నారు.
ఈ ఘటనతో మమడ పోలీస్ స్టేషన్‌పై ప్రజల్లో తీవ్ర చర్చ ప్రారంభమైంది. ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కలిగిన అధికారులే అవినీతికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.
ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఎస్సై అశోక్‌ను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
