సన్న బియ్యం స్టాక్ పంపిణీ సకాలంలో జరిగేలా చూడాలి.. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

బఫర్ గోదాంలకు అలాట్మెంట్ చేసిన జిపిఓలు, సంబంధిత అధికారులతో బియ్యం స్టాక్ పంపిణీపై సమీక్షించిన అదనపు కలెక్టర్,

సన్న బియ్యం స్టాక్ పంపిణీ సకాలంలో జరిగేలా చూడాలి.. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

ఖమ్మం, మార్చి -18: లోకల్ గైడ్ :

సన్న బియ్యం స్టాక్ పంపిణీ సకాలంలో జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు.  

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్, బఫర్ గోదాంలకు అలాట్మెంట్ చేసిన జిపిఓలు, సంబంధిత అధికారులతో 3 నెలల బియ్యం స్టాక్ పంపిణీపై సమీక్షించారు.

IMG-20260318-WA0124అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి  మాట్లాడుతూ* ఏప్రిల్ నుంచి జూన్-  2026 వరకు గల 3 నెలల రేషన్ ను ఒకేసారి అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. మూడు నెలల రేషన్ సరఫరాకు సంబంధించి 12 బఫర్ గోదాములకు 12 మంది జిపిఓ లను ఇంచార్జి లుగా నియమించడం జరిగిందని, 3 నెలల రేషన్ లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా రేషన్ షాపుల వారీగా స్టాక్ పంపిణీ జరిగేలా చూడాలని అన్నారు.

బఫర్ గోడౌన్ నుంచి స్టేజి 1 ద్వారా  ఎం.ఎల్.ఎస్. పాయింట్ లకు రేషన్ సరఫరా సకాలంలో పంపిణి చేయాలని, మన జిల్లా అవసరాలకు 25 వేల మెట్రిక్ టన్నులు, ఇతర జిల్లాల కోసం పంపిణి చేసే బియ్యం  క్వాంటిటి కూడా సరిగ్గా ఉండేలా చూడాలని అన్నారు. 

బియ్యం పంపిణీ ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాలని అన్నారు. ఎం.ఎల్.ఎస్. పాయింట్ నుంచి రేషన్ షాపులకు బియ్యం తరలింపు కూడా ఉదయం 9 గంటలకు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. హమాలీలు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. 

ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, ఎం.ఎల్.ఎస్. పాయింట్ ఇంచార్జి, స్టేజి 1 కాంట్రాక్టర్, గోడౌన్ ఇంచార్జి లు, జిపిఓలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం