ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పన.
పర్యావరణ శాస్త్రవేత్త బి. తిరుపతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.
By Ram Reddy
On
నిర్మల్ :లోకల్ గైడ్ :
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడటం వల్ల ప్రజల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, సింగిల్ యూసేజి ప్లాస్టిక్ నిషేధం లో ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ మార్గాలను ఆయన విద్యార్థులకు వివరించారు. సి.పి.సి.బి రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన బయో-డిగ్రేడబుల్ (జీవ విచ్ఛిన్నం చెందే) సంచుల వివరాలను విద్యార్థులకు వివరించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
28 Mar 2026 23:45:48
లోకల్ గైడ్ హైదరాబాద్హైదరాబాద్ జంట నగరాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు వేళలను ముందుకు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి వెళ్లింది. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో...
