మక్తల్ నియోజక వర్గం గ్రాముల రోడ్లకు మహర్దశ
కోటి55లక్షల నిధులు మంజూరు చేసిన ఎంపీ
బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి
నారాయణపేట మార్చి 18:
మక్తల్ నియోజకవర్గం లోని నర్వ,ఉట్కూర్,మక్తల్,మాగనూర్, కృష్ణా మండలాలకు ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్లు వేయడానికి అడిగిన వెంటనే కోటి 55 లక్షల నిధులను పాలమూరు ఎంపీ డి కే అరుణ మంజూరు చేయించారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి తెలిపా రు.ఈ సందర్భంగా ఆయన ఎంపీ డి కే అరుణ ను కలిసి కృతఙ్ఞతలు తెలిపారు.ఈ పనులను వీలైనంత త్వరలో పూర్తిచేయించాలని,పూర్తయిన సీసీ రోడ్లకు వెంటనే నిధు లు విడుదల చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు.
సర్పంచ్ ఎన్నికలలో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకు ని మక్తల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కలిపి సీసీ రోడ్లు వేయడానికి రెండు కోట్ల రూపాయలకు పైగా విడుదల చేసిన అరుణమ్మ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఫోటో రైట్ అప్:4.ఎంపీకి కృతఙ్ఞతలు తెలిపిన లక్ష్మీకాంత్ రెడ్డి
_______________________
