నేడు వ్యవసాయ మార్కెట్ కార్మికులకు దుస్తుల పంపిణీ * ఏ ఎం సి ఛైర్మన్ శివారెడ్డి .
నెల 26న పంపిణీ చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంపురం సదా శివారెడ్డి తెలిపారు.
నారాయణపేట జనవరి 25:
ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి ఆదేశాల మేరకు నిరంత రం నారాయణపేట వ్యవసా య మార్కెట్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు యూనిఫాం దుస్తులనుఈ నెల 26న పంపిణీ చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంపురం సదా శివారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఆస్ప త్రి డెవలప్మెంట్ కమిటీ డైరెక్టర్ కుంభం శివకుమార్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. మార్కెట్లో పనిచేస్తున్న దడ్ వాయిలు, హమాలీలు, చాట కూలీలు అందరూ పాల్గొని ఈ చిరు కానుకను పొందవల సిందిగా కోరారు. వైస్ చైర్మన్ కోణంగేరి హనుమంతు గారు, మార్కెట్ డైరెక్టర్లు, మార్కెట్ సిబ్బంది, మార్కెట్ వ్యాపారస్తులు, నారాయణపేట నియోజకవర్గ సర్పంచ్ లు, ఉప సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొని కార్మికులను ప్రోత్సహించాలని కోరారు.
ఫోటో రైట్ అప్:5.మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి
_____________________
