మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి.
జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు.
By Ram Reddy
On
*
మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించే బాధ్యత రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. శనివారం ఐడిఓసి సమావేశపు మందిరంలో ఆర్వోలు, ఏఆర్ఓలకు ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ మాట్లాడుతూ, చాలామందికి గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల పరంగా అభ్యర్థులు పోటీ చేస్తున్నందున జిల్లా ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు నిబంధనల ప్రకారం నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల సంఘం ముద్రించిన హ్యాండ్ బుక్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాని ప్రకారం తమకు కేటాయించిన విధులను నిర్వర్తించాలన్నారు. కౌంటింగ్ సమయంలో వ్యాలిడ్, ఇన్ వ్యాలిడ్ బ్యాలెట్ పేపర్ల విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలన్నారు. ఎన్నికల విధుల్లో ఏమైనా సందేహాలు ఉంటే ముందుగానే మాస్టర్ ట్రైనర్స్ ను అడిగి పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. విధుల్లో అలసత్వం వహించే వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ సర్పంచ్ ఎన్నికల మాదిరే మునిసిపాలిటీ ఎన్నికలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అంతకు ముందు రాష్ట్ర శిక్షకులు హరినాథ్ రెడ్డి హైదరాబాదు నుంచి ఎన్నికల విధులపై వర్చువల్ గా అవగాహన కలిగించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్స్ రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జెడ్పి డిప్యూటీ సీఈవో నాగేంద్రం, ఎన్నికల శిక్షణ నో డల్ అధికారి రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్లు, మాస్టర్ శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
03 Feb 2026 13:42:52
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
